తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా పవర్ స్టార్ గా కొనసాగుతున్న రామ్ చరణ్ యాక్షన్ సినిమాలను తెరకెక్కించే బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వినయ విధేయ రామ సినిమా తెరకెక్కింది. ఇక ఈ సినిమా స్టోరీ కూడా కొత్తగా ఉంది. ఇక ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్ లో రామ్ చరణ్ లుక్ చూసి అభిమానులు అందరూ ఒక్కసారిగా అంచనాలు పెంచుకున్నారు. సినిమా విడుదలైన తర్వాత ఒక రేంజ్ లో హిట్ సాధిస్తుంది అని అనుకున్నారు. కానీ ఈ సినిమా విడుదలయ్యాక చూసి ప్రేక్షకులందరికీ నిరాశ ఎదురైంది అని చెప్పాలి.
ముఖ్యంగా ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ చేసే యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులందరినీ బాగా ఇబ్బంది పెట్టాయి. సినిమా మొత్తం రక్తపాతమే ఉండడంతో.. చూస్తున్న ప్రేక్షకులందరికీ విరక్తి వచ్చింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సాధారణంగా తన సినిమాలోని యాక్షన్ తో ప్రేక్షకులందరినీ మంత్రముగ్ధులను చేసే బోయపాటి శ్రీను.. వినయ విధేయ రామ సినిమా ఎక్కడో కాలిక్యులేషన్స్ కోల్పోయి.. మితిమీరిన యాక్షన్ సన్నివేశాలతో చివరికి ప్రేక్షకులందరికీ కూడా సినిమా ఒక నరకంలా మార్చేస్తాడు. దీంతో ఇక ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఫ్లాప్ గా మిగిలిపోయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి