టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఎంతో మంది యంగ్ హీరోలు వచ్చారు. వారిలో కొంతమంది చిత్ర పరిశ్రమలో మంచి విజయం సాధించగా మరి కొంత మంది... చిత్రపరిశ్రమలోనే కనుమరుగయ్యారు. అయితే మరి కొంత మంది హీరోలు..  వారసత్వం ద్వారా వచ్చారు. అయితే ఇందులోనూ కొంత మంది అద్భుతంగా రాణిస్తూ ఉండగా మరి కొంతమంది విఫలమవుతున్నారు. అయితే వారసత్వ హీరోగా వచ్చిన వారిలో వరుణ్ తేజ్ కూడా ఒకరు. వరుణ్ తేజ్... మెగా హీరో నాగబాబు ముద్దుల తనయుడు. 2014 సంవత్సరం లో ముకుంద అనే సినిమాతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు హీరో వరుణ్ తేజ్. ఈ సినిమాలో హీరోయిన్ పూజ హెగ్డే కూడా కొత్తగా ఎంట్రీ ఇచ్చింది. 

వచ్చిన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సాధించాడు హీరో వరుణ్ తేజ్. ఆ తర్వాత హిస్టారికల్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో కంచె సినిమాలు చేశాడు వరుణ్ తేజ్. బ్రిటిష్ కాలం నాటి కథాంశంగా ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఈ కంచె సినిమా తెలుగు చిత్ర పరిశ్రమ బాక్సాఫీస్ ముందు బంపర్ సాధించింది. దీంతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని అగ్రహీరోలు లతో వరుణ్ తేజ్ పోటీ పడ్డాడు. దాని తర్వాత లోఫర్ మరియు మిస్టర్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు వరుణ్ తేజ్. అయితే ఈ సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. దీంతో వరుణ్ తేజ్ కాస్త డీలా పడ్డాడు.

అయినప్పటికీ తన ప్రయత్నాన్ని కొనసాగించాడు వరుణ్ తేజ్. ఫిదా మరియు తొలిప్రేమ సినిమాలతో మళ్లీ ఫామ్లోకి వచ్చాడు వరుణ్. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేసే విధంగా హిట్ అందుకున్నాయి. అంతే కాదు ఆ సినిమాలో అనంతరం కామెడీ ఎంటర్ టైనర్ గా ఎఫ్ 2 మరియు గద్దల కొండ గణేష్ ఈ సినిమాతో తిరుగులేని విజయాన్ని అందుకున్నాడు వరుణ్ తేజ్.ఇలా కొత్త కథాంశాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తూ... తండ్రిని మించిన తనయుడుగా వరుణ్ తేజ్ నిలుస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: