"రేవంత్"  ఈ పేరుకు కొత్తగా పరిచయం అవసరం లేదు.  ఇండియన్ ఐడల్ 9 లో విన్నర్ గా నిలిచి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు.

బాహుబలి సినిమాలో తానూ పాడిన  "మనోహరి" పాటకు  వచ్చిన క్రేజ్ అంత ఇంత కాదు.

శ్రీకాకుళం లో పుట్టి పెరిగిన ఎల్.వి. రేవంత్ సింగర్ అవుదాం అని హైదరాబాద్ కి వచ్చారు.

 టెలివిషన్ లో మ్యూజిక్ టాలెంట్ షోస్, రియాలిటీ షోస్ తో తన మ్యూజిక్ కెరీర్ స్టార్ట్ అయింది.

తాను మొట్టమొదటి గా పార్టిసిపేట్ చేసిన షో "సప్త స్వరాలు" ఈ షో ఈటీవీ లో వచ్చేది.

తర్వాత  మా టీవీ లో వచ్చిన సూపర్ సింగర్ 5  మరియు సూపర్ సింగర్ 7 లో రన్నర్ అప్ గా నిలిచి తరువాత  అదే ఛానల్ లో వచ్చిన   పర్ సింగర్ 8  లో మెంటర్ గా ఉంటూ పార్టిసిపెంట్స్ కి గైడెన్స్ ఇచ్చారు.

సోనీ టెలివిజన్ లో వచ్చే రియాల్టీ సింగింగ్ షో , ఇండియన్ ఐడల్  సీజన్ 9 లో గెలిచి  ఇండియా మొత్తంలో తనని గుర్తుపట్టే విధంగా పేరు సాధించి దానితో పాటు  మహీంద్రా కేయూవీ 100  మరియు ఇరవై ఐదు లక్షల క్యాష్ ప్రైజ్ ని తన సొంతం చేసుకున్నారు.

మ్యూజిక్ రియాల్టీ షో లో 2010 లో  "సూపర్ సింగర్ 5 " ,2013 లో "సూపర్ సింగర్ 7 ", 2014 - 2015 లో  "సూపర్ సింగర్ 8 "

2018 లో 16th సంతోషం ఫిలిం అవార్డ్స్ లో బెస్ట్ మేల్ ప్లేబాక్  సింగర్,తెలుగు ఫిల్మ్  టీవీ  అవార్డ్స్,    ఐఫా  ఉత్సవం  అవార్డు  వంటి పలు అవార్డ్స్ ని సొంతం చేసుకున్నారు.

వందేమాతరం శ్రీనివాస్ గారి కంపాషన్ తో తన ఫస్ట్ డెబ్యూ చేశారు-అది 2008 లో  మహా యజ్ఞం చిత్రం లోని  "ఝలక్ దిక్ లాజ”

2019 లో జీ తెలుగు టీవీ సిరీస్ రాధమ్మ కూతురు కోసం టైటిల్ ట్రాక్‌ను కంపోజ్ చేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: