అక్కినేని హీరోలలో ప్రస్తుతం ఎక్కువ సినిమాలతో బిజీ అవుతున్న వారిలో నాగ చైతన్య టాప్ లో ఉన్నాడు అని తెలుస్తుంది.గత కొంతకాలంగా అతని బాక్సాఫీస్ మార్కెట్ కూడా అంతకంతకూ పెరుగుతూనే ఉందని సమాచారం.

ఎలాంటి సినిమా చేసినా కూడా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుతున్నాయని తెలుస్తుంది. నిర్మాతలకు నాగ చైతన్య మంచి లాభాలను అందిస్తున్నాడని సమాచారం. దీంతో అతనితో సినిమాలు చేసేందుకు అడ్వాన్స్ ఇవ్వడానికి కూడా కొందరు సిద్ధమవుతున్నారని తెలుస్తుంది. ఈ శుక్రవారం అయితే లవ్ స్టొరీ ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.ఇక ప్రస్తుతం నాగ చైతన్య అయితే చాలా బిజీగా ఉన్నాడని తెలుస్తుంది.

వచ్చే ఏడాది తుది దశ వరకు కూడా అతని డేట్స్ దొరకడం చాలా కష్టం అని తెలుస్తుంది.ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యూ సినిమాతో బిజీగా ఉన్న సంగతి అందరికి తెలిసిందే. ఇక బాలీవుడ్ లో కూడా అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా సినిమా షూటింగ్ తుది దశకి చేరుకుందని సమాచారం.ఇక ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ తో ఒక వెబ్ సిరీస్ లో చేయనున్నాడని తెలుస్తుంది. దానికి కూడా విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించనున్నాడని వార్త వినిపిస్తుంది.

 

ఈ ప్రాజెక్టులతో పాటు movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ మరియు పరశురామ్ కాంబినేషన్లో ఒక సినిమా చేయాల్సి ఉందని సమాచారం. పరశురాం ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు పాట తో బిజీగా ఉన్న విషయం అందరికి తెలిసిందే. ఆ సినిమా పూర్తి అయిన వెంటనే నాగచైతన్య పరశురామ్ సినిమాను మొదలుపెట్టాలని అనుకుంటున్నట్లు సమాచారం. అలాగే మరో రెండు సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నట్లు సమాచారం. ఇక ఇప్పట్లో ఎవరైనా నాగచైతన్యతో ఏదైనా సినిమా చేయాలని అనుకుంటే వచ్చే సంవత్సరం వేసవి వరకు వేచి ఉండాలని తెలుస్తుంది.
నాగ చైతన్య  నటించి మెప్పించిన లవ్ స్టోరీ మూవీ ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి మరి

మరింత సమాచారం తెలుసుకోండి: