2020 వ సంవత్సరం జనవరి 10వ తేదీన అంగరంగ వైభవంగా, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం లో విడుదలైన చిత్రం సరిలేరు నీకెవ్వరు.. ఈ సినిమా కథ సింపుల్ అయినప్పటికీ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సినిమాల కంటే , ఈ సినిమా కంటెంట్ కొంచెం భిన్నంగా ఉంది అని చెప్పవచ్చు. ఒక లేడీ ప్రొఫెసర్..తన సమస్యల నుండి ఒక ఆర్మీ మేజర్ ఎలా సేవ్ చేశాడు అనేది స్టోరీ. ఆ హీరోకి , ఆ లేడీ ప్రొఫెసర్ కి మధ్య ఉన్న అనుబంధం ఏమిటి..? స్టేట్ మినిస్టర్ కు ప్రొఫెసర్ కు మధ్య ఉన్న గొడవ ఏమిటి..? ఇలాంటి ప్రశ్నలు సినిమా చుట్టు తిరుగుతాయి.


సినిమా ఫస్టాఫ్ ప్రేక్షకులను బాగా మెప్పించింది.. ఇందులో బ్యాంగ్ బ్యాంగ్ అనే పాటలో మిల్క్ బ్యూటీ తమన్నా స్టెప్పులేసి బాగా మెప్పించింది. అంతేకాదు రష్మిక మందన చేసే సందడి , సంగీత, హరితేజ, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్ ఇలా అందరూ తమదైన శైలిలో నటించి ఫస్టాఫ్ అంతా బాగా సందడి చేశారు." మియావ్ మియావ్ పిల్లి మిల్క్ బాయ్ తో పెళ్లి" అనే డైలాగ్ బాగా పాపులారిటీని అందుకుంది..

సెకండాఫ్ లో వచ్చే ప్రకాష్ రాజ్ తో ఫైటింగ్ అలాగే నల్లమల అడవుల్లో జరిగే ఫైట్స్ అన్ని కూడా ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తాయి. క్లైమాక్స్ సింపుల్ గా కొంచెం డిఫరెంట్ గా ప్రయత్నించాడు దర్శకుడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అంతే కాదు వన్ మ్యాన్ షో గా మహేష్ బాబుకు మంచి గుర్తింపును అందించింది. డాన్స్, ఫైట్స్, డైలాగ్స్, మహేష్ బాబు మ్యానరిజం ఇలా అన్ని సినిమాకు హైలెట్ గా నిలిచాయి. ఇక అలనాటి తార సంగీత కూడా ఈ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇందులో ఈ సినిమాకు విజయశాంతి 100% తన పాత్రకు న్యాయం చేసిందని చెప్పవచ్చు.. మొత్తానికి అందరూ చాలా బాగా నటించడంతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమా.


మరింత సమాచారం తెలుసుకోండి: