టాలీవుడ్ ఇండస్ట్రీలో చైల్డ్ యాక్టర్ గా తన కెరియర్ ను మొదలు పెట్టాడు కమెడియన్ ఆలీ. అలా తన కెరియర్ మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు తన హవా కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇక ఆలీ ఎటువంటి పాత్రకైనా న్యాయం చేయగల సత్తా ఉన్న కమెడియన్ లలో ఆలీ కూడా ఒకరు. కమెడియన్ అలీకి మొట్టమొదటిగా మంచి నటుడిగా గుర్తింపు తెచ్చిన సినిమా ప్రేమఖైదీ. ఇక ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఒకానొక సందర్భంలో తెలియజేశాడు ఆ విషయాలు చూద్దాం.

తాను మద్రాసులో ఎన్నో కష్టాలను అనుభవించాను.. ఆ కష్టాలతో పోలిస్తే హైదరాబాద్ లో పడిన కష్టాలు తక్కువే అని తెలియజేశారు. ఆలీ మద్రాసులో ఎన్నో కష్టాలను అనుభవిస్తేనే.. స్టార్ గా ఎదగడం సాధ్యమవుతుందని అప్పట్లో సినీ ఇండస్ట్రీలో అనుకునేవారు అని తెలియజేశారు. ఆలీ దగ్గర అ డబ్బులు లేకపోవడంతో.. ఆరు మాసాల వరకు కాఫీ, బన్ను తిని బతికేవాడట. ఇక తనకి ప్రేమఖైదీ సినిమాలో అవకాశం రావడంతో.. హైదరాబాద్కు షూటింగ్ కోసం రావాలని తన స్నేహితుడు తెలిపారని ఆలి తెలియజేశారు.


కానీ అలీ తాను వెళ్లాల్సిన రైలు వెళ్లిపోవడంతో.. వేరొక ట్రైన్ టికెట్ తీసుకుని బయలుదేరడట. కాని సికింద్రాబాద్ కి వెళ్లే మార్గంలో ట్రైన్  ఆగిపోయిందని తెలియజేశారు. ఆలీ ఒకపక్క షూటింగ్ టైం కావడంతో, మరొక వైపు రైలు ఆగిపోవడంతో ఏం చేయాలో తెలియక రైలు పట్టాలపై రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లానని ఆలీ తెలియజేశాడు.

అలా నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఫిలింనగర్ కు ఎలా వెళ్లాలో తెలియక ఆటో వాళ్ళని అడిగితే వారు అన్నపూర్ణ స్టూడియో వరకే వెళ్తామని చెప్పగా.. ఆటోలోనే జూబ్లీహిల్స్ వరకు వెళ్లి ఆ తర్వాత ఫిలింనగర్ కు ఆ దారిలో వెళ్లే టువంటి కొంత మంది అడుగుతూ నడుచుకుంటూ వెళ్లి అని తెలియజేశాడు. ఏది ఏమైనా అంత కష్టపడ్డారు కాబట్టే.. ఇప్పుడు స్టార్ కమెడియన్ లలో ఒకరిగా పేరు పొందాడు అని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: