సంక్రాంతి పండుగకు తెలుగునాట పెద్ద హీరోల సినిమాలు విడుదలవడం ఎంత కామనో, అలా ఎన్ని సినిమాలు విడుదలైన హిట్ టాక్ ను సంపాదించుకున్న అన్ని సినిమాలకు మంచి కలెక్షన్లు రావడం కూడా అంతే కామన్. ఇది తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా తమిళనాట కూడా సంక్రాంతి పండుగకు చాలా సినిమాలే బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతూ ఉంటాయి.  సంక్రాంతి పండుగను తమిళనాడులో పొంగల్ పేరుతో జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా తమిళ స్టార్ హీరోలు బాక్సాఫీసు వద్ద తమ సినిమాలతో పోటీ పడుతూ ఉంటారు. అయితే రాబోయే సంక్రాంతి  బరిలో బాక్సాఫీస్ వద్ద తలపడడం కోసం ఇప్పటికే స్టార్ హీరోలు తమ సినిమా విడుదల తేదీని ఖరారు చేస్తూ బాక్సాఫీస్ వద్ద కు వార్ కు సిద్ధం అవుతున్నారు.

ఇప్పటికే పోటాపోటీ హీరోలుగా పేరున్న అజిత్, విజయ్ లు మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర  ఢీకొన్ననున్నారు. వచ్చే పొంగల్ కు వీరిద్దరు చిత్రాలు విడుదల కావడంపై క్లారిటీ వచ్చేసింది. అజిత్ సినిమా 'వాలిమై' ని వచ్చే పొంగల్ కు విడుదల చేయబోతున్నట్టుగా నిర్మాత బోనీ కపూర్ ప్రకటించిన నేపథ్యంలో విజయ్ తో బాక్సాఫీస్ వద్ద వారు ఖరారైంది. విజయ్ 'బీస్ట్' సినిమా కూడా పొంగల్ విడుదల కాబోతుంది. వాలిమై డైరెక్టర్ హెచ్ వినోద్ కాగా సెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 'బీస్ట్' మూవీ రూపొందింది. 'బీస్ట్' సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అజిత్, విజయ్ ల మధ్య, ప్రత్యేకించి వారి అభిమానుల మధ్య పోటీ అనేది ఈనాటిది కాదు. మరి ఈ ఇద్దరు స్టార్ హీరోల  సినిమాలో ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబడుతోంది తెలియాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే. ఈ ఇద్దరు స్టార్ హీరోలతో పాటు మరే హీరో అయిన పొంగల్ పోటీలోకి వస్తారో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: