సినీ ఇండస్ట్రీలో సాధారణంగా హీరోయిన్లు అయితే కొన్ని సంవత్సరాలు నటించిన తర్వాత ఫేడ్ ఔట్ అవుతూ ఉంటారు ..కానీ హీరోల విషయంలో అలా జరగదు.. ఆరు పదుల వయస్సు వచ్చిన తర్వాత కూడా అంతే క్రేజ్ తో సినీ ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతూ ఉంటారు.. ఇకపోతే సినీ ఇండస్ట్రీలో చిరకాలం కొనసాగాలంటే అదృష్టం ఉండాలి.. కొంతమంది హీరోలు అప్పట్లో మెరిసి అవకాశాలు లేక , అదృష్టం వరించక సినీ ఇండస్ట్రీకి దూరం అయ్యారు.. అలాంటి వారిలో ప్రముఖ హీరో రాజా కూడా ఒకరు.. అయితే సినీ ఇండస్ట్రీకి ఎందుకు దూరం కావాల్సి వచ్చిందో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..


హీరో రాజా.. పుట్టింది విశాఖపట్నం అయినా పెరిగింది మాత్రం హైదరాబాదులోని అని చెప్పాలి.. అయితే రాజా డిగ్రీ పూర్తి చేసుకొని ఎయిర్హోస్టెస్ లో ఉద్యోగం చేస్తున్న సమయంలోనే ,ఎక్కడో ఒక మూల తనలో నటనలో ప్రావీణ్యం పొందాలి అనే ఆలోచన కలిగింది. ఇక ఆ ఆలోచన నాటకాలు వేయడానికి వెళ్ళినప్పుడు రామానాయుడు కంట్లో  పడ్డాడు రాజా.. ఇక తన నటనను చూసి వెంటనే ఒక సినిమాలో అవకాశం ఇవ్వడానికి రాజాకు ఫోన్ చేశాడు. అలా  దగ్గుబాటి రామానాయుడు నిర్మాణంలో వచ్చిన ఓ చినదానా సినిమా ద్వారా రాజా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.. ఇకపోతే ఎయిర్హోస్టెస్ లో పనిచేస్తున్నప్పుడు ముంబైలో ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ కొడుకులు రాజాకు బాగా పరిచయం..

ఇక ఈ సాన్నిహిత్యం కారణంగా ఈవీవీ సత్యనారాయణ కూడా రాజా కి మరొక సినిమాలో నటించే అవకాశాన్ని కల్పించాడు. ఆ తర్వాత ప్రముఖ ఫ్యామిలీ దర్శకుడిగా గుర్తింపు పొందిన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఆనంద్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఇక తర్వాత ,అప్పుడప్పుడు, కల, మిస్టర్ మేధావి, ఆ నలుగురు వంటి మరికొన్ని చిత్రాల్లో నటించి , అప్పట్లో ఒక మంచి హీరోగా గుర్తింపు పొందుతున్న సమయంలోనే.. ఏమైందో తెలియదు కానీ ఈయన సడన్ గా  క్రైస్తవ మత ప్రచారం లోకి చేరి పోయాడు.. అంతేకాదు గత మూడు, నాలుగు సంవత్సరాల నుంచి రాజా క్రైస్తవ మత ప్రచారం చేస్తూ.. అక్కడే లీనమై పోయాడు.. క్రైస్తవ మత ప్రచారం చేయడానికి గల కారణం ఏమిటి..? అని ఒకరు అడగ్గా.. ఆయన.. సినిమా అనేది మాయ మాత్రమే..అప్పుడు ఎన్నో తప్పులు చేశాను ..ఆ తప్పులను సరిదిద్దుకోవడం కోసమే క్రైస్తవ మతంలో చేరానని తెలిపారు. అంతేకాదు ప్రస్తుతం రాజా మాటలు విన్నట్లయితే , ఈయన క్రైస్తవ మతంలో ఎంతగా లీనమైపోయారో మనకు అర్థమవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: