సమంత-చైతు ల వివాహం అనంతరం ఇద్దరు అనేక చిత్రాలలో కలిసి నటించారు. దానికి తొలిమెట్టు వేసింది మాత్రం మజిలీ తోనే. ప్రేమ కధ గా కనిపించినప్పటికీ, అది చివరికి భార్యాభర్తల మధ్య ప్రేమ చిగురించడంతో ముడిపెట్టి దర్శకుడు ప్రేమకు చక్కని నిర్వచనం చెప్పాడు. ఈ చిత్రం వివాహం తరువాత ఇద్దరు కలిసి చేస్తున్న మొదటిది కావడంతో సమంత భర్త విజయం కోసం బాగా కృషి చేసినట్టు అప్పట్లో వార్తలు హల్ చల్ చేశాయి. దర్శకుడు శివ నిర్వాణ స్వయంగా కధరాసుకొని మరి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇందులో సమంత దంపతులు ప్రధాన పాత్రలు పోషించగా, చైతు ప్రేమ కధలో దివ్యాన్షా కౌశిక్ కూడా ప్రధాన పాత్రలో కనిపించారు. చైతు నటన కూడా ఈ చిత్రంలో మెరుగులు దిద్దారని చూస్తేనే తెలిసిపోతుంది.

ఈ చిత్రంపై సమంత ప్రత్యేక శ్రద్ద తీసుకున్నది అనే అంశంలో చైతు నటనకు మెరుగులు దిద్దటం కూడా ఒకటి. తాను ప్రేమిస్తున్న వ్యక్తి మరొకరిని ప్రేమిస్తున్నాడు అని తెలిసి కూడా పరిస్థితుల ప్రభావంతో అతడినే పెళ్లి చేసుకోవడం, తరువాత అతడు భార్యను జీవితంలో స్వాగతించలేక పడుతున్న ఇబ్బందిని అర్ధం చేసుకొని వేచి చూస్తున్న పాత్రలో సమంత జీవించారనే చెప్పాలి. తాగుడు, గొడవలతో జీవితాన్ని వృధా చేసుకుంటూ, ప్రేమ విఫలమైన కుర్రాడిగా, జీవితంలో క్రీడాకారుడిగా ఆవాలనుకొని అనుకోని పరిస్థితులతో ఆ అవకాశం  పోగొట్టుకున్న వాడిగా చైతును కూడా దర్శకుడు చెక్కడంలో సఫలీకృతుడు అయ్యాడు.

ఇక ప్రేమించిన వ్యక్తి బిడ్డను కానీ చనిపోయిందని తెలిసి, తన బిడ్డకు కోచ్ గా ఉంటూ తననే చివరికి బిడ్డగా దత్తత తీసుకునే అంశాలు, ఈ సందర్భంలో భార్యాభర్తల మధ్య చిగురించిన ప్రేమను దర్శకుడు చక్కగా తెరకెక్కించాడు. ఈ పాత్రలన్నీ ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టుగా కాకుండా కాస్త పాతకాలం నాటివిగా తీర్చిదిద్దటంతోనే ఫలితం ఆశించినంతగా దర్శకుడు సాధించాడు అనేది స్పష్టంగా చెప్పవచ్చు. అంటే కధ కాస్త పాతకాలంలో జరిగినట్టుగా పాత్రల చిత్రీకరణ కూడా అదే స్థాయికి తీసుకెళ్లిన విధానం కూడా చక్కగా అమరింది.  ఈ నేపద్యాలు చిత్రాన్ని విజయపధంలో నడిపించాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకు తగిన పాత్రలు ఎంచుకోవడంలో దర్శకుడు రాజీ పడకపోవడం కూడా చిత్ర విజయానికి దారితీసింది. కధ పాతదే అయినప్పటికీ దానిని తీర్చిదిద్దే విధానంతో దర్శకుడు విజయం అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: