హాట్ బ్యూటీ నభా నటేష్ కన్నడ మూవీ 'వజ్రకాయ' తో వెండి తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత హాట్ బ్యూటీ నభా నటేష్ టాలీవుడ్ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన 'నన్ను దోచుకుందువటే' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ బ్యూటీ ఆ తర్వాత రవితేజ హీరోగా తెరకెక్కిన 'డిస్కో రాజా' మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపక పోయిన ఈ ముద్దుగుమ్మ నటనకు, అందచందాలకు హావభావాలకు తెలుగు ప్రజల నుండి మంచి మార్కులే పడడంతో రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఈస్మార్ట్ శంకర్' సినిమాలో ఈ ముద్దుగుమ్మ అవకాశం వచ్చింది. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో నభా నటేష్ కు తెలుగులో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.

ఈ సంవత్సరం ఇప్పటికే నభా నటేష్ , బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన 'అల్లుడు అదుర్స్' సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. దీనితో పాటే రీసెంట్ గా నభా నటేష్ హీరోయిన్ గా నటించిన 'మ్యాస్ట్రో' సినిమా ప్రముఖ 'ఓటిటి'  డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అంత ఎక్కువగా ఉంటుంది. తన డైలీ ఆక్టివిటీస్ ను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. వీటితో పాటే తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును వేడెక్కిస్తు ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా కూడా నభా నటేష్ తన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో నభా నటేష్ గోల్డ్ ప్లస్ సిల్వర్ కలర్ అద్దాలు పొదిగిన దుస్తులను ధరించి హాట్ హాట్ ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: