తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో రకాల పాత్రలు పోషించి తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నాడు బాలసుబ్రమణ్యం. నటుడిగా గాయకుడిగా సంగీత దర్శకుడిగా ఎన్నో రకాలుగా ప్రజలకు సేవలు అందించిన బాలసుబ్రహ్మణ్యం కొన్ని డబ్బింగ్ సినిమాలకి తెలుగులో గాత్రదానం చేశాడు. అంతే కాకుండా తమిళంలో కూడా ఆయన గాత్రదానం చేశారు. అలా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఇప్పటివరకు చాలా సినిమాలకు పని చేయగా కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, విష్ణువర్ధన్, జెమినీ గణేషన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, నగేష్, రఘువరన్ లాంటి గొప్ప గొప్ప నటులకు ఆయన గాత్ర దానం చేసి వారి పాత్రలకు జీవం పోశాడు.

కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన తమిళ అనువాద చిత్రం మన్మధలీల తో అనుకోకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మారే అవకాశం వచ్చింది. ఆ సినిమాలో నటించిన కమల్ హాసన్ కు తెలుగులో బాల సుబ్రహ్మణ్యం డబ్బింగ్ చెప్పగా ఆ తరువాత ఆయన ప్రతి సినిమాకు బాలసుబ్రహ్మణ్యమే డబ్బింగ్ చెబుతూ వచ్చాడు. అంతేకాదు రజినీకాంత్ కు కూడా ఈయనే మొదట్లో డబ్బింగ్ చెప్పేవాడు. 2010 లో కమల్ హాసన్ కథానాయకుడిగా వచ్చిన దశావతారం చిత్రంలో కమల్ పోషించిన పది పాత్రల్లో ఏడు పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పి రికార్డును సృష్టించాడు. ఈ సినిమాలో ముసలావిడ పాత్రకు సైతం బాలునే డబ్బింగ్ చెప్పడం విశేషం. 

అన్నమయ్య చిత్రంలో సుమన్ పోషించిన శ్రీ వెంకటేశ్వరస్వామి పాత్రకు, అలాగే సాయి మహిమ చిత్రంలో సాయిబాబా పాత్రకు డబ్బింగ్ చెప్పి ఆ దేవతామూర్తులను గుర్తుచేశాడు. ఈ రెండు చిత్రాలకు గాను ఆయనకు ఉత్తమ డబ్బింగు కళాకారుడు గా నంది పురస్కారం లభించింది. అంతే కాదు గాంధీ బయోపిక్ వచ్చిన గాంధీ సినిమా లో గాంధీ పాత్ర ధారి అయిన బెన్ కింగ్స్లే కు తెలుగులో బాలు డబ్బింగ్ చెప్పి తన జన్మ ధన్యం చేసుకున్నాడు. ఇలా అన్ని రంగాలలో సినిమా పరిశ్రమలో సేవలు అందించి ఇప్పుడు ఇంత గొప్ప మరణం పొంది శాశ్వతం గా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయాడు. బాలసుబ్రమణ్యం నిజంగా గొప్ప వీరమరణం పొందాడనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: