ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫుల్ జోష్ లో వరుస సినిమాల్లో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలలో 'భీమ్లా నాయక్' సినిమా మీద  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల దృష్టి ఉంది. ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చక చక పూర్తి చేయడం, మాత్రమే కాకుండా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ లను  కూడా ఎప్పటికప్పుడు బయటకు వదులుతూ అభిమానులను ఆనందపరుస్తూ ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఫస్ట్ గ్లిమ్స్ ను మరియు ఒక పాటను కూడా విడుదల చేశారు. ఇలా పవన్ కళ్యాణ్ కు సంబంధించి అప్డేట్ లను వరుసబెట్టి చిత్రబృందం విడుదల చేశారు.

తాజాగా ఈ సినిమాలో మరో హీరో అయిన దగ్గుబాటి రానా కు సంబంధించిన ఒక ప్రోమోను కూడా చిత్ర బృందం బయటకు వదిలారు. దీనికి కూడా ప్రజల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే 'భీమ్లా నాయక్' సినిమాకు సంబంధించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ గ్లిమ్స్ ను చిత్రబృందం విడుదల చేసిన 24 గంటలు లోపే అత్యధిక వ్యూస్ ను దక్కించుకున్న గ్లిమ్స్  గా రికార్డులోకేక్కింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ తో ఈ రికార్డు నమోదు అయ్యింది. ఈ రికార్డును తమిళ హీరో అజిత్ తన వాలిమై గ్లిమ్స్ తో బ్రేక్ చేస్తాడని చాలామంది భావించారు. కాని పవన్ రికార్డును చేరుకోవడంలో అజిత్ వెనుకబడ్డాడు. ఆయన 'వాలిమై' సినిమాకు 24 గంటల్లో 6.8 మిలియన్ ల వ్యూస్ మాత్రమే తెచ్చుకుంది. పవన్ 'భీమ్లా నాయక్' గ్లిమ్స్ కు మాత్రం ఏకంగా 8.4 వ్యూస్ రావడంతో పాటు అత్యధిక లైక్స్ ను  కూడా తెచ్చుకుంది. అత్యధిక వ్యూస్ తో పాటు అత్యధిక లైక్లను కూడా సంపాదించుకున్న  పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ఫస్ట్ గ్లిమ్స్ కు ఇప్పట్లో ఎలాంటి డోకా లేదు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: