సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తున్నాడు.గీతా గోవిందం ఫేమ్ పరశురాం ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్,14 రీల్స్ ,జిఎంబీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 70 శాతానికి పైగా పూర్తయింది.ఇక ఈ సినిమాలో మహేష్ బాబు మరింత స్టైలిష్ గా కనిపించనుండగాఈ సినిమాతో మహేష్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.తాజాగా మహేష్ బాబు సర్కారు వారి పాట  సినిమా గురించి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

కేవలం ఒక్క సిట్టింగ్ లోనే సర్కారు వారి పాట సినిమాకు ఓకే చెప్పానని మహేష్ తెలిపారు.సర్కారు వారి పాట సినిమా కథ తనకు ఎంతో నచ్చిందని..సర్కారు వారి పాట పోకిరి సినిమాకు ఏమాత్రం తగ్గదని మహేష్ బాబు వెల్లడించారు.ఈ సినిమా కచ్చితంగా పోకిరి వైబ్స్ ని తీసుకొస్తుందని మహేష్ బాబు పేర్కొన్నారు.తనకు సినిమా కథ కోసం ఎక్కువ సిట్టింగ్స్ వేయడం నచ్చదని మహేష్ బాబు చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తీ సురేష్ కథానాయికగా నటిస్తోంది.బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుంది.సినిమాలో మహేష్ బాబు ఓ బ్యాంక్ మేనేజర్ గా కనిపించనున్నాడు.

ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది.వెల్లడించారు.ఇక వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13 న విడుదల కానుంది.ఇక ఈ సినిమా అనంతరం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు మహేష్. అయితే ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత తాను రాజమౌళి దర్శకత్వంలో నటిస్తానని అన్నారు మహేష్ బాబు.ఇక మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనుందని సమాచారం.ఇక రాజమౌళి మహేష్  కాంబినేషన్లో తెరకెక్కే సినిమా 2022 సెకండాఫ్ లో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: