ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో భారీ క్రేజ్ తో ప్రేక్షకులను ఎంతగానో ఊరిస్తున్న సినిమా సలార్. కే జి ఎఫ్ సినిమా తో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆ సినిమాను విడుదల చేయకముందే ఈ సినిమాను మొదలు పెట్టి దాదాపు పూర్తి చేసే స్థాయికి తీసుకు వచ్చాడు. వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్న ప్రభాస్ ఈ చిత్రాన్ని రాధే శ్యామ్ చిత్రం తర్వాత విడుదల చేస్తున్నాడు. సంక్రాంతి కానుకగా రాధే శ్యామ్ విడుదల అవుతుండగా సమ్మర్ లో ఈ సినిమాను విడుదల చేస్తాడేమో చూడాలి.

ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ లోకి వెళ్తున్న ప్రభాస్ ఈ చిత్రంతో మరింత పాపులారిటీ దక్కించుకొని తన రేంజ్ ను ఎవరు అందుకోలేని స్టేజ్ తీసుకు వెళ్లాలని భావిస్తున్నాడు. ఈ చిత్రాన్ని భారీ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిస్తున్న ప్రశాంత్ నీల్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచే భారీ అంచనాలను ఏర్పరచుకుంది. అయితే సినిమా చూసిన దగ్గర్నుంచి ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ లపై ప్రశాంత్ పై భారీగానే ట్రోల్స్ మొదలయ్యాయి. ఎందుకంటే ఈ సినిమా కోసం మరియు ఆయన గత సినిమా కోసం ఆయన చేసే సినిమాల అన్ని పోస్టర్లు ఒకే విధంగా నలుపురంగు లోనే ఉన్నాయి.

అయితే సినిమా పోస్టర్ అంటే నలుపు రంగులో ఎందుకు విడుదల చేయాలి అన్న విధంగా ఆయనపై ట్రోల్స్ మొదలయ్యాయి. కేజిఎఫ్ కూడా ఆ విధంగా నలుపు రంగు లోనే పోస్టర్లు విడుదల చేయడంతో సలార్ విషయంలో కొంత డిఫరెంట్ గా ట్రై చేస్తే బాగుండేది అన్న ప్రశ్న అందరి నుంచి మొదలయ్యింది.  అయితే ఈ సినిమా పోస్టర్లు ఇలా తయారు చేయడానికి హాలీవుడ్ లెవల్లో సమాధానం దొరికింది. ఈ సినిమాకి ప్రశాంత్ హాలీవుడ్ లో వినియోగించే ను డార్క్ సెంట్రిక్ థీమ్ ను ఉపయోగిస్తున్నారు. హాలీవుడ్ లో బ్యాట్ మాన్ సినిమా, క్రిస్టోఫర్ నొలన్ సినిమాలు, బ్లాక్ సెంట్రిక్ సినిమాలు చూసే ఉంటారు. ఆ తరహాలోనే ఈ సినిమా ను చేసి ప్రేక్షకులకు కొత్తగా ప్రజెంట్ చేయాలని భావిస్తున్నాడట ప్రశాంత్. సో డార్క్ పోస్టర్ వెనుక సీక్రెట్ ఇది అన్నమాట. 

మరింత సమాచారం తెలుసుకోండి: