టాలీవుడ్ లో సంక్రాంతి వచ్చింది అంటే సినిమా పండగ మొదలవుతుంది. ప్రతి సంవత్సరం సంక్రాంతి కనీసం 4 సినిమాలైన విడుదల కి సిద్ధం అవుతాయి. అయితే ఈ ఏడాది మాత్రం ఆ పోటీ బాగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికె మహేష్ బాబు సర్కారు వారి పాట , పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాలు సంక్రాంతి కి స్లాట్ బుక్ చేసుకున్నాయి. అలాగే ప్రభాస్ రాధే శ్యామ్ కూడా తమ సినిమాని సంక్రాంతి కె విడుదల చేస్తున్నాం అని ప్రకటించారు. అయితే ఇప్పుడు వీటికి పోటీగా ఆర్ఆర్ఆర్ కూడా సంక్రాంతి బరిలో దిగబోతుంది.

 ఈ సినిమాని అక్టోబర్ 13న విడుదల చేస్తాం అని మూవీ టీం ఎప్పటినుంచో చెప్తూ వస్తుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ సమయంలో సినిమా విడుదల అయితే నష్టాలు తప్పవు అని మూవీ టీం భావించి సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నాం అని చెప్పింది. అయితే ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ ని వచ్చే ఏడాది సంక్రాంతి కి విడుదల చేసే ఆలోచనలో ప్రొడ్యూసర్స్ ఉన్నారు అని టాక్. దీని గురించి ఈ వారంలోనే ఆఫీషల్ గా అనౌన్సమెంట్ వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే కనుక నిజం అయితే సంక్రాంతి సినిమాల మీద దీని ప్రభావం గట్టిగా ఉంటుంది. ఎందుకంటే  ఆర్ఆర్ఆర్ కి తెలుగులోనే కాదు ఇండియా అంత ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు.

సినిమా కోసం దేశమంతా ఎదురుచూస్తుంది. ఒకవేళా సంక్రాంతిసినిమా హిట్ అయ్యి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఈ సినిమాని అపాడం ఎవరి వల్ల కాదు. అలాగే తెలుగులో టాప్ స్టార్స్ పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు సినిమాలు కూడా విడుదల అవుతున్నాయి కాబట్టి వాటి ప్రభావం కూడా ఆర్.ఆర్.ఆర్ మీద పడే అవకాశాలు బాగానే ఉన్నాయి. ఈ సినిమాల విడుదలతో వచ్చే ఏడాది సంక్రాంతి రసవత్తరంగా ఉండబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: