టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది కమెడియన్స్ ఉన్నారు. సినిమా హిట్ కొట్టాలంటే సినిమా కథ ఎంతో ముఖ్యమో.. అందులో నటించే కమెడియన్స్ కూడా అంటే అవసరం. కామెడీ లేకుండా ఏ సినిమా హిట్ అయిన సందర్భాలు కూడా లేవు. కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ నేపథ్యంలో రిలీజ్ అయిన సినిమాలు కూడా మంచి సక్సెస్ అయ్యాయి. ఇతర భాషల కంటే తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న కమెడియన్లు ఎంతో క్రేజ్ ఎక్కువ. టాలీవుడ్‌లోని కొందరు కమెడియన్లు ఆ సినిమాలో నటిస్తున్నారంటే చాలు సినిమా సక్సెస్ అవుతుందని అనుకుంటారు. అలాంటి కమెడియన్స్‌లో వేణుమాధవ్ ఒకరు.

మొదట్లో వేణుమాధవ్ నటించని సినిమాలంటూ ఉండేది కాదు. ఏ సినిమాలో చూసినా వేణుమాధవ్ కనిపిస్తూ ఉండేవారు. ఇండస్ట్రీలో అంతలా క్రేజ్ పెంచుకున్న వేణుమాధవ్ చివరకు ఎలాంటి సినిమా అవకాశాలు రాక.. అనారోగ్యానికి గురై తుది శ్వాస వదిలారు. 2013 నుంచి 2014 సంవత్సరంలో వేణుమాధవ్ నటించని సినిమాలు లేవు. అద్భుతమైన నటనతో.. కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఎంతగానో నవ్వింపజేసేవారు. తెలుగు సినీ పరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన వేణుమాధవ్‌కు క్రమక్రమంగా అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఇండస్ట్రీలో కొత్త కమెడియన్లు రావడం ఒక కారణమైతే.. వేణుమాధవ్‌కు తగిన పాత్ర దొరకకపోవడం మరో కారణం.

కొందరు రచయితలు, డైరెక్టర్లు సినిమా కథను సిద్ధం చేసుకునేటప్పుడే పాత్రలను సెలక్ట్ చేసుకుంటారు. ఆయా పాత్రలకు సెట్ అయ్యే నటులను ముందుగానే దృష్టిలో పెట్టుకుంటారు. అలా వారి పాత్రకు తగ్గట్టు స్టోరీని ప్లాన్ చేసుకుంటారు. అయితే వేణుమాధవ్‌కు సినిమాల్లో అవకాశాలు వచ్చేవి. కానీ డబుల్ మీనింగ్ డైలాగులే ఎక్కువ ఉండేవంట. దర్శకులు తప్పనిసరిగా ఈ డైలాగులు చెప్పాలని చెప్పడంతో వేణుమాధవ్ ఒప్పుకునేవారు కాదంట. దీంతో వేణుమాధవ్‌కు అవకాశాలు పూర్తిగా తగ్గిపోతూ వచ్చాయి. ఆ తర్వాత అనారోగ్యానికి గురయ్యారు. ఒకేసారి మూత్రపిండం, కాలేయ సమస్యలు తలెత్తడంతో హైదరాబాద్‌లో యశోద ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. చికిత్స పొందుతూ 2019 సెప్టెంబర్ 25వ తేదీన తుది శ్వాస విడిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: