టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అగ్ర దర్శకుడిగా పూరీ జగన్నాథ్ కి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఎన్నో విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించి.. ఎంతోమంది హీరోలని తన సినిమాల ద్వారా స్టార్స్ చేసిన ఘనత ఈ దర్శకుడిది.అలా డైరెక్షన్లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న పూరీ జగన్నాథ్ గారి పుట్టినరోజు ఈ రోజు.ఈ సందర్భంగా అభిమానులుమరియు సినీ సెలెబ్రిటీలు ఆయనకి సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ ని అందజేస్తున్నారు.ఈ క్రమంలోనే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా పూరీ జగన్నాథ్ కి తన స్పెషల్ విషెస్ ని తెలిపారు.'హ్యాపీ బర్త్ డే పూరీ సర్.ఆనందం, మరియు గొప్ప ఆరోగ్యంతో ఈ ఏడాదిని గడపండి' అంటూ ట్వీట్ చేసాడు మహేష్.

ఈ నేపథ్యంలో తాజాగా మహేష్ ట్వీట్ ని రీప్లేస్ చేస్తూ.. ఒకప్పటి హీరోయిన్, ఇప్పటి నిర్మాత అయిన ఛార్మి కౌర్ 'థాంక్యూ' అని రిప్లై ఇచ్చింది.ఇక తన సినిమా పనులతో పూరీ జగన్నాథ్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాకు దూరమయ్యారు.అందుకే పూరీ జగన్నాథ్ కి బర్త్ డే విషెస్ చెప్పిన వాళ్లందరికీ చార్మినే రిప్లై ఇస్తోంది.కాగా మహేష్ బాబుతో పూరీ జగన్నాథ్ గతంలో పోకిరి, బిజినెస్ మెన్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను చేసిన విషయం తెలిసిందే.ఇక ప్రస్తుతం వీరిద్దరి హ్యాట్రిక్ కాంబో కోసం అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు.

ఇక ప్రస్తుతం పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండతో 'లైగర్' అనే సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతోంది.ఇక విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక కరోనా తర్వాత ఈ మధ్యే మొదలైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం గోవాలో ఈ సినిమా షూటింగ్ ని జరుపుకుంటోంది.ఈ నెల 30 తో చిత్ర యూనిట్ గోవా షెడ్యూల్ పూర్తి చేసుకోబోతోందని సమాచారం.ఇక సీనియర్ నటి రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాని పూరీ జగన్నాథ్, చార్మీ, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: