తెలుగు సినిమాలలో కామెడీ మూవీస్ తో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న దర్శకుడు మారుతి. ఈరోజుల్లో లాంటి ఒక చిన్న సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన మారుతి ఆ సినిమాలో తన మార్కు కామెడీని వెండి తెరపై చూపించిన విధానంతో తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కించుకున్నాడు. ఆ తర్వాత బస్ స్టాప్, బలే బలే మగాడివోయ్, బాబు బంగారం, ప్రతి రోజు పండగే వంటి పలు చిత్రాలకు దర్శకత్వం వహించి తెలుగులో ఒక మంచి దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం మారుతి గోపీచంద్ హీరోగా రాశి కన్నా హీరోయిన్ గా పక్కా కమర్షియల్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ బ్యానర్లపై ఈ మూవీను తెరకెక్కిస్తున్నారు.

ఈ మూవీలో సత్యరాజ్, రావు రమేష్, అనసూయ భరద్వాజ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా తో పాటు పేపర్ బాయ్ సినిమా తో హీరోగా పరిచయమై ఏక్ మినీ కథ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంతోష్ శోభన్ తో మంచి రోజులు వచ్చాయి అనే సినిమాను కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే మంచి రోజులు వచ్చాయి సినిమా నుండి ఒక లేటెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాను నవంబర్ 4 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది, ఈ సినిమాలో ముద్దుగుమ్మ మెహరీన్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు. యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్, వి సెల్యులాయిడ్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో పాటు సంతోష్ శోభన్ నందిని రెడ్డి దర్శకత్వంలో ‘అన్ని మంచి శకునములే అనే మూవీ లో కూడా నటిస్తున్నాడు. మరి ఈ సినిమాలతో సంతోష్ శోభన్ ఎలాంటి విజయాలను అందుకున్నాడో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: