మనదేశంలో బయోపిక్ లకు కాస్త డిమాండ్ ఎక్కువగా ఉంటుందనే విషయం తెలిసిందే. బయోపిక్ లకు సంబంధించి ఇటీవల కాలంలో కొంతమంది దర్శక నిర్మాతలు అలాగే కొంతమంది స్టార్ హీరో హీరోయిన్లు ఆసక్తి చూపిస్తున్నారని ప్రచారం మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని బయోపిక్ లకు సంబంధించి ఇటీవలి కాలంలో జరుగుతున్న ప్రచారాలు కూడా సినిమా వర్గాల్లో సంచలనం అవుతుంది. కొంతమంది రాజకీయ ప్రముఖులు అలాగే క్రికెట్ ప్రముఖులకు సంబంధించిన జీవిత కథను తెరపై చూపించడానికి చాలామంది ప్రముఖ దర్శకులు ఆసక్తి చూపిస్తూ ముందుకు అడుగులు వేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ జీవిత కథను తెరపై చూపించడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే సోనియాగాంధీ జీవిత కథ తెలుసుకోవడానికి ఒక ప్రముఖ దర్శకుడు ఆమె నివాసానికి వెళ్లి అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ బయోపిక్ ని ఒక కాంగ్రెస్ పార్టీ ఎంపీ నిర్మించే అవకాశం ఉందని బయోపిక్ లో నటించడానికి  ఢిల్లీకి చెందిన ఒక హీరోయిన్ సిద్ధంగా ఉన్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సదరు హీరోయిన్ తో చిత్ర నిర్మాత కూడా మాట్లాడారు అని అంటున్నారు.

దర్శకుడు నిర్మాత ఇద్దరు కలిసి ఈ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారని ప్రధానంగా సోనియా గాంధీ జీవిత కథలో ఆమె అనుభవించిన బాధల ను అలాగే రాజీవ్ గాంధీ తో వివాహం తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీ పెద్దలతో ఎదుర్కొన్న ఇబ్బందులను ఈ సినిమాలో చూపించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అలాగే ఇందిరా గాంధీ మరణం తర్వాత రాజీవ్ గాంధీ పడిన ఇబ్బందులను సోనియాగాంధీ ఎదుర్కొన్న సమస్యలను ఈ సినిమాలో చూపించేందుకు రెడీ అవుతున్నారని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి ఈ సినిమాను విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారని కాంగ్రెస్ వర్గాల మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: