ఆర్ఎక్స్ 100 సినిమా తో హీరో గా పరిచయమై ఒక్కసారి గా టాలీవుడ్ లో ప్రభంజనాన్ని సృష్టించాడు హీరో కార్తికేయ. అయితే తొలి సినిమా పెద్ద సక్సెస్ అవడంతో హీరో గా నిలదొక్కుకున్న కార్తికేయ ఆ తర్వాత చేసిన సినిమాలతో ఆ రేంజ్ హిట్ ను అందుకోలేకపోయాడు. ఆ సినిమా తర్వాత భారీ ఫ్లాపులు రావడంతో ఒక్కసారిగా ఆయనను ఆయన కెరియర్ ను ఆ సినిమాలు వెనక్కి నట్టినట్లుగా తెలుస్తుంది.

ఆర్ఎక్స్ 100 తర్వాత ఆయన చేసిన హిప్పీ చిత్రం పెద్ద దర్శకుడితో పెద్ద నిర్మాత తో కలిసి చేయగా అది బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యింది. ఆ తర్వాత గుణ 369, 90 ఎమ్ ఎల్ సినిమాలు ఆయన హీరోగా ప్రేక్షకుల ముందుకు రాగా అవి పర్వాలేదు అని అనిపించుకున్నాయి.  ఆ విధంగా కార్తికేయ హీరో గా మాత్రమే కాకుండా అన్ని రకాల పాత్రలు చేయాలని చెప్పి నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రం లో విలన్ గా నటించాడు.  ఆ సినిమా నటుడిగా ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకు వచ్చాయి అని చెప్పవచ్చు. 

ఆయన హీరోగా చేసిన చావు కబురు చల్లగా సినిమా కూడా ఆయన కు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకు వచ్చాయి. కానీ కమర్షియల్ గా ఈ చిత్రం కూడా సక్సెస్ కాలేకపోయింది. ప్రస్తుతం ఆయన అజిత్ హీరోగా నటిస్తున్న వాలిమై అనే తమిళ చిత్రం లో విలన్ గా నటించి అక్కడ తెరంగేట్రం చేయబోతున్నాడు.  అంతే కాకుండా రాజా విక్రమార్క సినిమాలో కూడా ఆయన హీరోగా చేస్తున్నాడు. స్పై యాక్షన్ కామెడీ చిత్రం గా వస్తున్న ఈ సినిమా తప్పకుండా తనకు మంచి విజయాన్ని తెచ్చి పెడుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడు. నవంబర్ 12వ తేదీన ఈచిత్రం విడుదల కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: