న్యాచురల్ స్టార్ నాని హిట్ ఫ్లాప్ అని తేడా లేకుండా వరుస చిత్రాలతో దూకుడు చూపిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నాని చేతిలో "శ్యామ్ సింగరాయ్", "అంటే సుందరానికి" అనే రెండు చిత్రాలు చేతిలో ఉండగా, తాజాగా మరో నూతన చిత్రాన్ని అనౌన్స్ చేశారు నాని. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కున్న ఈ చిత్రానికి "దసరా" అనే టైటిల్ ఖరారు చేసారు. ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయాలని భావిస్తోంది చిత్రబృందం. అయితే ఈ సినిమాకి సంబందించిన ఓ తాజా వార్త తెలుగు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే ఇదో షాకింగ్ న్యూస్...ఇంతకీ విషయం ఏమిటంటే నాని "దసరా" సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుండగా, స్టార్ హీరోయిన్ సమంత గెస్ట్ రోల్ చేయబోతున్నట్లు సమాచారం.

గత రెండు మూడు నెలలుగా సామ్ చైతు ల విడాకుల విషయం కారణంగా వీరిపై  పలు వార్తలు వైరల్ గా మారాయి. సమంత అయితే ఇక తెలుగు సినిమాలు చేయబోయేది లేదని వార్తలు వీర విహారం చేశాయి. కొందరైతే ఈమె టాలీవుడ్ చిత్రాలు చేస్తుంది. కానీ ఇప్పట్లో కాదు అన్నారు. ఇలా ఎన్నో గాసిప్స్ వినిపిస్తున్న నేపథ్యంలో నాని తాజా చిత్రం "దసరా " లో సమంత కూడా నటించబోతున్నారన్న వార్త అభిమానుల కళ్ళల్లో మళ్ళీ ఆనందాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ న్యూస్ పై ఇంకా ఓ క్లారిటీ రాలేదు.


కానీ ఇదే కనుక నిజమైతే సామ్ ఫ్యాన్స్ కి మాత్రమే కాకుండా ఆమెని అభిమానించే ప్రతి ప్రేక్షకుడికి ఇది చాలా పెద్ద శుభవార్తే అని చెప్పాలి.  అయితే సమంత గతంలో నానితో ఈగ, ఎటో వెళ్ళిపోయింది మనసు చిత్రాల్లో కలసి నటించింది. అదే కాక ఈగ సినిమాతో సమత కెరియర్ కీలక మలుపు తిరిగింది. నానితో ఉన్న ఆ స్నేహంతోనే ఈ సినిమాకి నో చెప్పలేక సమంత ఒకే చెప్పి ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైనా ఇది శుభపరిణామమే అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: