ప్రతి వారం లాగానే టాలీవుడ్ సినిమా పరిశ్రమ నుంచి ఈ వారం కూడా మంచి మంచి సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అయ్యాయి. చిన్న సినిమాలే అయినా కూడా అవి ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్ ను నెలకొని ఉంచాయి. ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న పుష్పక విమానం సినిమా నవంబర్ 12వ తేదీన శుక్రవారం విడుదల కాబోతుంది. దీనికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను చిత్ర బృందం ఎంతో శరవేగంగా జరుపుకుంటు ఉండగా నిర్మాతగా విజయ్ దేవరకొండసినిమా ప్రమోషన్స్ పనులను దగ్గరుండి చూసుకుంటున్నారు.

కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఎప్పటిలాగే ఓ విభిన్నమైన కథాంశంతో ఈ చిత్రాన్ని ఆనంద్ దేవరకొండ చేస్తున్నాడని తెలుస్తోంది. దర్శకుడు దామోదర ఎంతో మంచి కథను చేయనున్నాడని ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించారు. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ గా నటిస్తుండగా వీరిద్దరికు మంచి పేరు రాబోతుందని తెలుస్తుంది. ఇక సంగీతం పరంగా కూడా ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

ఇకపోతే ఈ సినిమాతో పాటే కార్తికేయ హీరోగా నటించిన రాజా విక్రమార్క సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. టీజర్ తో ట్రైలర్ తో సినిమా ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు పెంచగా ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని కార్తికేయ వెల్లడిస్తున్నారు. ఆయన తొలి చిత్రం ఆర్ఎక్స్ 100 తప్ప చిత్రం కూడా ప్రేక్షకులను అలరించిన దాఖలాలు లేవు. దాంతో ఈ సారి తప్పకుండా ప్రేక్షకులను అలరించే సినిమా చేయాలని ఆయన భావించాడు. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందా అనేది చూడాలి. మరి ఈ వారం విడుదల కాబోతున్న ఈ రెండు సినిమాలలో విజయం ఎవరికి వరిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: