ప్రస్తుతం బుల్లితెరపై అసలు సిసలైన డాన్స్ పర్ఫార్మెన్స్ లకు కేరాఫ్ అడ్రస్గా.. ఇండస్ట్రీలో రాణించాలి అనుకునే డాన్స్ మాస్టర్ లకు ఒక మంచి వేదికగా మారిపోయింది ఈటీవీ లో ప్రసారమయ్యే  ఢీ అనే కార్యక్రమం. ఈ కార్యక్రమం ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులందరికీ కూడా ఎంతగానో అలరిస్తుంది. దాదాపు 13 ఏళ్ల నుంచి కూడా ఈ కార్యక్రమం బుల్లి తెర పై ఎంతో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది అని చెప్పాలి. ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న ఎంతోమంది ఈ కార్యక్రమంలో ఒకప్పుడు కంటెస్టెంట్ గా చేసిన వారే కావడం గమనార్హం.



 అంతేకాదు  మొన్నటివరకు ఢీ షోలో కొరియోగ్రాఫర్ గా చేసిన వారు సైతం ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో డాన్స్ మాస్టర్ గా రాణిస్తున్నారు. కాగా ఈ షో ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది.. అయితే ఒకప్పుడు ఢీ షో అంటే కేవలం డాన్స్ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం డాన్స్ తో పాటు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ కూడా ప్రేక్షకులకు అందిస్తున్నారు. దీంతో కామెడీ షో ల కంటే ఎక్కువగా ఢీ కార్యక్రమం ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇటీవలే సెమీఫైనల్స్ పూర్తిచేసుకున్న ఈ కార్యక్రమం క్వార్టర్ ఫైనల్ కూడా పూర్తి చేసుకోబోతోంది. సాధారణంగా ఢీ గ్రాండ్ ఫినాలే జరుగుతున్న సమయంలో ఒక సినిమా హీరోని స్పెషల్ గెస్ట్ గా పిలుస్తూ ఉంటారు.



 ఇప్పటికే  ప్రభుదేవా, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ లు ఫైనల్లో వచ్చి అభిమానులు అందరినీ అలరించారు అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా టాలీవుడ్ స్టార్ అల్లుఅర్జున్ మరోసారి గ్రాండ్ ఫినాలే కి రాబోతున్నాడు అని అర్థమవుతుంది  ఈ క్రమంలోనే ఇటీవలే దీనికి సంబంధించిన ప్రోమోని సోషల్ మీడియాలో విడుదల చేయగా ఈ ప్రోమో వైరల్ గా మారిపోయింది. ఇప్పటికే ఒకసారి అల్లు అర్జున్ ఢీ షో గ్రాండ్ ఫినాలే కి గెస్ట్ గా వచ్చాడు. ఇక ఇప్పుడు మరో సారి గెస్ట్ గా రాబోతు ఉండడం గమనార్హం.  ఇది ఈసారి పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన  అల్లు అర్జున్ ఢీ స్టేజ్ పై అడుగు పెట్టబోతు ఉండడంతో ఇక గ్రాండ్ ఫినాలే పై అంచనాలు పెరిగిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Etv