తెలుగు సినిమా పరిశ్రమలో ఒకప్పుడు కాజల్ వరుస సినిమాలతో దూసుకుపోయిన పరిస్థితి మనకు తెలిసిందే. అయితే గత కొన్ని రోజుల నుంచి కాజల్ తో పెద్దగా అవకాశాలు రాకపోయినా సరే కొన్ని పాత్రలకు సంబంధించి కాజల్ తో కొంతమంది చర్చిస్తున్నారు అని ప్రచారం జరిగింది. ప్రస్తుతం కాజల్ తెలుగులో ఒక్క సినిమా మాత్రమే చేస్తూ ఉండగా తమిళంలో ఆమెకు మంచి ఆఫర్ వచ్చిందని అలాగే బాలీవుడ్ లో కూడా 12 ఆఫర్లు వచ్చాయి అని వార్తలు వినిపించాయి. ప్రస్తుతం కాజల్ తెలుగులో ఒక సినిమాకు ఐటెం సాంగ్ కూడా చేస్తుంది అనే మాట వినపడుతోంది.

వివాహం తర్వాత పెద్దగా కాజల్ వార్తలు లేకపోయినా సరే ఆమెకు తెలుగు సినిమా పరిశ్రమలో ఏ మాత్రం కూడా క్రేజ్ తగ్గలేదు అని కొంత మంది అగ్ర నిర్మాతలు కొన్ని కొన్ని పాత్రలకు అవసరమైతే కాజల్ పేరును పరిశీలిస్తున్నారని అంటున్నారు. ఇక కాజల్ కూడా కొన్ని కొన్ని విషయాల్లో కాస్త డిమాండ్ చేయకుండా తెలుగు సినిమా నిర్మాతలకు నచ్చిన విధంగా ముందుకు వెళుతుందని కూడా సమాచారం. ప్రస్తుతం కాజల్ చేతిలో ఒక్క సినిమానే ఉన్నా సరే ఆమెకు మరి కొన్ని ఆఫర్లు కూడా భవిష్యత్తులో వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసే అవకాశం ఉందని దీనికి సంబంధించి కొరటాల శివ ఇప్పటికే  మాట్లాడారని కూడా సమాచారం. ఈ సినిమా ఐటమ్ సాంగ్ కి సంబంధించి ఒక ప్రముఖ రచయిత ఆమె కోసం పాట చాలా నీట్ గా రాస్తున్నారని ఆమె ఈ స్థాయికి తగిన విధంగా ఈ పాట ఉంటుందని కూడా అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే తెలుగులో సినిమాలు చేయకపోయినా వివాహంతో సినిమాలకు దూరంగా ఉన్నా సరే కాజల్ క్రేజు తగ్గకపోవడం మాత్రం ఆమె అభిమానులను అలరించే చేస్తున్న విషయం అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: