సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక రంగుల ప్రపంచం ఇక్కడ ఏదైన జరగచ్చు. బాగా క్లిక్ అవుదాం అనుకుని వచ్చిన హీరో బొక్కబోర్లా పడితే.. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన నటులు మంచి కసెస్ సాధించిన దాక్గలలాలు ఎన్నో ఉన్నాయి. ఇలా మనం ఊహించనవి ఎన్నో సినీ ఇండస్ట్రీలో జరుగుతుంటాయి. ఎన్నో కోట్లు ఖర్చు చేసి తెరకెక్కించే సినిమా హిట్ అవ్వాలని ప్రతి ఒక్క డైరెక్టర్, ప్రోడ్యూసర్, హీరో,హీరోయిన్ లు కోరుకుంటారు. కానీ ఆ సినిమా ఫ్లాప్ అయితే ఆ బాధ చెప్పలేనిది.

ఒక్క సినిమా తెర పైకి రావాలంటే ఎన్నో కష్టాలు పడాలి, ఎన్నో నిద్ర లేని రాత్రుల్లు గడపాలి, ఎన్నో అవాంతరాలను ఎదురు కోవాలి అప్పుడే ఆ సినిమా బొమ్మ తెర పై పడుతుంది. ఇక సినిమా హిట్టా ఫట్టా అనేది ప్రేక్షకుల చేతిలో ఉంటుంది. అయితే , ఇక్కడ ఒక బడా దర్శకుడు మాత్రం తన సినీ కెరీర్ లో  ఒక్క ఫ్లాప్ అయినా పడితే బాగుండూ అని అనుకున్నారట. ఓ ఫ్లాప్ సినిమా నా ఖాతాలో ఇవ్వు దేవుడా అంటూ ఎందరో దేవుళ్లను  కోరుకుంటున్నాడట. ఇంతకి ఆ డైరెక్టర్ ఎవరు..? ఎందుకు అలా తన సినిమా ఫ్లాప్ అవ్వాలి అని కోరుకున్నాడో..ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకుందాం..!!

అసలు విషయంలోకి వెళితే.. కోదండరామిరెడ్డి.. ఈ దర్శకుడు గుర్తున్నారు కదా.. అయినా ఆయనను మర్చిపోవడం అంత సులువు కాదులేండి. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించిన కోదండరామిరెడ్డి కి సినీ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. చాలా మంది నటులకు తన సినిమాలో అవకాశం ఇచ్చిన ఈయన డైరెక్షన్ లో చేయాలని ప్రతి ఒక్క హీరో కోరుకుంటారు. బడా హీరోస్ కూడా ఈయనతో కలిసి వర్క్ చేయాలి అని అనుకునేవారు..అంటే ఈయన ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉండేదో అర్ధం చేసుకోండి. ప్రళయ రుద్రుడు, కిరాయి రౌడీలు, అభిలాష , ప్రేమమూర్తులు, చాలెంజ్ ,కిరాయి కోటిగాడు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన ఈయన క్రేజ్  చూసి..ఒకానొక సమయంలో ఈయన తో సినిమా చేయాలని బడా నిర్మాతలు ఈయన ఇంటికి క్యూ కట్టడంతో..కోదండరామిరెడ్డి ఏం చేయాలో అర్ధంకాక ఆ దేవుడిని నాకు ఒక్క ఫ్లాప్ సినిమా ఇవ్వు దేవుడా అని కోరుకున్నాడట. ఆయనకు ఒక ఫ్లాప్ సినిమా పడితే అప్పుడైన ఇలా నిర్మాతలు నన్ను విసిగించరు..అప్పుడు నేను  ఆకాశంలో కాకుండా నేలపై  నడుస్తా అని ఆ భగవంతుడిని వేడుకున్నాడట కోదండరామిరెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: