సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమా పరిశ్రమ లో ఎన్నో పాటల ద్వారా గొప్ప గీత రచయిత గా ఇప్పుడు ఇంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. మూడు దశాబ్దాల క్రితం ఆయన తన సినీ కెరీర్ ను ప్రారంభించి ఇప్పటి వరకు ఎంతో మంది సంగీత దర్శకులతో కలిసి పని చేశారు. ప్రేక్షకుడి మదిలో నిలిచి పోయే ఎన్నో అద్భుతమైన గీతాలను ఆయన అందించగా తెలుగు కళామతల్లి కి ఇప్పటివర కు ఆయన ఎన్నో పాటల ద్వారా తన విశేషమైన సేవలను అందించారు.

మొదటి పాటకు ఆయన ఎంత అయితే ఆసక్తి తో పాట రాశారో ఇప్పటికి కూడా ఏదైనా పాట రాస్తే అంతే ఇంట్రెస్ట్ తో రాసి పాటల పట్ల ఆయనకు ఉన్న ఆసక్తిని తెలియపరుస్తారు. మొదటి సినిమాతోనే తనలోని సరస్వతిని ప్రపంచానికి చాటి చెప్పిన సిరివెన్నెల అన్ని పాటలలోనూ అదే రకమైన ప్రతిభను చాటి చెబుతూ ప్రేక్షకులను ఇప్పటివరకు ఎంతగానో అలరిస్తూ వచ్చారు.  ఇక ఆయనకు సిరివెన్నెల అనే బిరుదు ఆయన తొలి చిత్రం సిరివెన్నెల సినిమా కావడంతో వచ్చింది అన్న విషయం అందరికీ తెలిసిందే.

పలు సందర్భాల్లో సిరివెన్నెల సీతారామశాస్త్రి తన పేరుకు ముందు సిరివెన్నెల అనే గొప్ప చిత్రం యొక్క పేరును బట్టి తనను సంబోధించడం కొన్నిసార్లు ఎన్నో సంతోషంగా అనిపించిన కూడా కొన్నిసార్లు అది ఎంతో బరువుగా అనిపిస్తుందని ఆయన వెల్లడించారు. దానికి కారణం అంత గొప్ప సినిమా పేరును తనకు బిరుదుగా పెట్టుకునే అవకాశం అర్హత తనకు లేదని ఆయన చెబుతుండడం విశేషం. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ సాహితీవేత్త లో ఒకరైన సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ విధంగా మాట్లాడడం నిజంగా ఆయన గొప్పతనం అని చెప్పవచ్చు. ఆయన ఇటీవల కాలంలో యువ గీత రచయితలతో పోటాపోటీగా పాటలు రాస్తూ తన గొప్పతనాన్ని చాటుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: