నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత స‌మంత పూర్తిగా కెరీర్ పై దృష్టిపెట్టిన ప‌రిస్థితే క‌నిపిస్తోంది. నాలుగేళ్ల వైవాహిక జీవితం త‌ర్వాత ఆమె చైతుకు విడాకులు ఇచ్చేసింది. ఎంతో అన్యోన్యంగా ప్రేమించుకున్న ఈ జంట విడాకులు తీసుకోవ‌డం చాలా మందికి న‌చ్చ‌డం లేదు. అస‌లు అభిమానులు వీరు విడాకులు తీసుకున్న విష‌యాన్ని జీర్ణించు కోలేక పోతున్నారు.

ఇదిలా ఉంటే చైతుకు విడాకులు ఇచ్చేశాక ఇప్పుడు స‌మంత పూర్తి గా త‌న కెరీర్ మీదే కాన్ సంట్రేష‌న్ చేస్తోన్న ప‌రిస్థితి ఉంది. ఈ క్ర‌మంలోనే ఆమె తెలుగు లో గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న శాకుంత‌లం సినిమా తో పాటు ప‌లు సినిమాలు చేస్తోంది. అలాగే ఆమె బాలీవుడ్ మీద కూడా కాన్ సంట్రేష‌న్ చేస్తోంది. ఇక బాలీ వుడ్ కెరీర్ పై దృష్టి పెట్టిన స‌మంత ఇప్పుడు అక్క‌డ ఓ బ‌డా నిర్మాణ సంస్థ‌తో ఏకంగా భారీ ఒప్పందం కుదుర్చుకునే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. బీ టౌన్ బిగ్ బ్యానర్ల లో ఒక‌టి అయిన‌ యష్ రాజ్ ఫిలిమ్స్ తో స‌మంత చర్చలు జరుపుతోంది.

అక్క‌డ ఒకేసారి రెండు , మూడు సినిమాల‌కు ఆమె సైన్ చేస్తోంద‌ట‌. ఈ డీల్ సెట్ అయితే స‌మంత బాలీవుడ్ లోనే మూడు, నాలుగు సంవ‌త్స‌రాల పాటు ఉండాల్సి ఉంటుంది. గ‌తంలో ఈ బ్యాన‌ర్లో సిన‌మాలు చేసిన వారు ఎంతో మంది పాపుల‌ర్ అయ్యారు. ఇప్పుడు స‌మంత కూడా ఇదే బ్యానర్లో నాలుగు అయితే సినిమా ల‌కు ఒకే సారి సైన్ చేస్తే మూడు నాలుగేళ్ల పాటు అక్క‌డ చూసుకునే ప‌ని కూడా ఉండ‌దు.

రెమ్యున‌రేష‌న్ త‌క్కువ అయినా కూడా బ్యాన‌ర్లో టాప్ సినిమాలు వ‌స్తుంటాయి. స‌మంత చైతు ను పెళ్లి చేసుకోవ‌డానికి ముందు నుంచే బీ టౌన్ ఛాన్సుల కోసం ప్ర‌య‌త్నాలు చేస్తూ ఇప్ప‌ట‌కి స‌క్సెస్ అయ్యింది. మ‌రి స‌మంత బీ టౌన్ లో ఎలా క్రేజ్ తెచ్చుకుంటుందో ?  చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: