అయితే ఇటీవలి కాలంలో స్టార్ హీరోల సినిమాల దగ్గర నుంచి చిన్న హీరోల సినిమాల వరకు ఏ సినిమా విడుదలైన కూడా కొన్ని రోజుల ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడం లాంటివి చేస్తూ ఉన్నారు. అంగరంగ వైభవంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడం ఇక ఈ కార్యక్రమానికి కొంతమంది స్పెషల్ గెస్ట్ లను ఇన్వైట్ చేయడం లాంటివి చేస్తున్నారు. ఇలా ఒక రకంగా ఏకంగా సినిమాకి కలిసి వచ్చే విధంగా స్పెషల్ గెస్ట్ లను ఇన్వైట్ చేస్తూ ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే డిసెంబర్ 12వ తేదీన పుష్ప సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక మెగా ఫ్యామిలీకి పెద్దగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి పుష్ప ఫ్రీ రిలీజ్ ఈవెంట్ స్పెషల్ గెస్ట్ గా రాబోతున్నాడు అని అందరూ అనుకున్నారు.
కానీ అల్లు అర్జున్ పుష్ప సినిమా కోసం స్పెషల్ గెస్ట్ గా రాబోతుంది ఒక పాన్ ఇండియా స్టార్ అని ఇటీవలే టాక్ మొదలైంది. భారీ స్థాయిలో నిర్వహించబోతున్న ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని ముఖ్య అతిథిగా ఆహ్వానించారట చిత్ర బృందం. బాహుబలి సినిమాతో ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు ప్రభాస్. కేవలం టాలీవుడ్లోనే కాదు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ హీరో గా మారిపోయాడు.. ఇక అలాంటి ప్రభాస్ ని స్పెషల్ గెస్ట్ గా పిలిస్తే సినిమా కి కలిసొచ్చే అవకాశం ఉందని చిత్రబృందం భావిస్తోందట. కాగా త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్టు తెలుస్తోంది.