టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ , మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబోలో ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సినిమా ఆర్ ఆర్ ఆర్‌. రాజ‌మౌళి గ‌త రెండు సంవ‌త్స‌రాల నుంచే ఈ సినిమాను చెక్కుతూ వ‌స్తున్నారు. ఇప్ప‌టికే రెండు సార్లు రిలీజ్ డేట్ ప్ర‌క‌టించాక కూడా ఈ సినిమాను వాయిదా వేశారు. అయితే ఎట్ట‌కేల‌కు సంక్రాంతి కానుక‌గా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. జ‌న‌వ‌రి 7వ తేదీన ఆర్ ఆర్ ఆర్ థియేట‌ర్ల లోకి రానుంది.

ఇక ఈ సినిమా ప్ర‌మోష‌న్లు కూడా స్పీడ‌ప్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో మ‌రో పిడుగు లాంటి వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆర్ ఆర్ ఆర్ మ‌రో సారి వాయిదా ప‌డ‌నుందా ? అంటే అయితే అవ్వ‌వ‌చ్చు అన్న వార్తే ఇప్పుడు అంద‌రిని ఆందోళ‌న లో ప‌డేస్తోంది. ప్రస్తుతానికి దేశంలో కరోనా కంట్రోల్ లో ఉంద‌నే అంద‌రం అనుకుంటున్నాం. అయితే వ‌చ్చే యేడాది మెద‌టి వారం నుంచి దేశంలో మ‌రోసారి క‌రోనా కేసులు తీవ్రం అవుతాయ‌ని అంచ‌నా వేస్తున్నారు.

ఒమిక్రాన్ అనే కొత్త వైర‌స్ ద‌క్షిణా ఫ్రికాలో స్టార్ట్ అయ్యి ఇప్ప‌టికే ప్ర‌పంచం అంత‌టా శ‌ర‌వేగంగా విస్త‌రిస్తోంది. దీంతో ఇదే థ‌ర్డ్ వేవ్ గా రూపాంత‌రం చెందుతుంది అన్న ఆందోళ‌న ప్ర‌తి ఒక్క రిలోనూ ఉంది. ఇక ఇప్ప‌టికే క‌రోనా కార‌ణం గా రెండు సార్లు థియేట‌ర్లు మూత ప‌డ్డాయి. ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ థియేట‌ర్ల బిజినెస్ కాస్త కోలుకుంటోంది.

ఇలాంటి టైంలో మ‌రోసారి థియేట‌ర్లు మూసి వేయాల్సి వ‌స్తే పెద్ద సినిమాల‌కు భారీ న‌ష్టం త‌ప్ప‌దు. ఈ లెక్క‌న చూస్తే ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ డేట్ కూడా ఏ స‌మ్మ‌ర్ కో వాయిదా ప‌డినా పెద్ద‌గా ఆశ్చ‌ర్య పోవాల్సిన ప‌ని లేద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెపుతున్నాయి. అయితే అదే జ‌రిగితే సినిమాకు భారీ న‌ష్టం త‌ప్ప‌దు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR