ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో సమంత కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో ఏళ్ల పాటుస్టార్ హీరోయిన్గా గ్లామర్ పాత్రల్లో నటించిన హీరోయిన్.. అక్కినేని నాగచైతన్య తో పెళ్లి జరిగి అక్కినేని కోడలు గా మారిన తర్వాత  నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో మాత్రమే  నటించి మెప్పించింది. వైవిధ్యమైన పాత్రలకు సమంత కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇటీవల నాగచైతన్య సమంత విడాకులు ప్రకటించి షాక్ ఇచ్చింది . నాగచైతన్యతో విడాకుల తర్వాత తన కెరీర్ పైనే పూర్తిగా దృష్టి పెట్టింది ఈ అమ్మడు.

 వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటూ ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే ఏకంగా బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది సమంత. బాలీవుడ్ లో మాత్రమే కాదు హాలీవుడ్ లో కూడా తన సత్తా చాటాలని  నిర్ణయించుకుంది.ఈ క్రమంలోనే సమంతాకు ఒక అద్భుతమైన ఆఫర్ కూడా వచ్చింది.  ఆ పాత్రకు సమంత ఓకే చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది అని చెప్పాలి. ఏకంగా బైసెక్సువల్ పాత్రలో నటించేందుకు కూడా సమంత ఒప్పుకొంది.


 సమంత తీసుకున్న ఈ నిర్ణయం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అరేంజ్మెంట్ ఆఫ్ లవ్ హాలీవుడ్ మూవీ లో బైసెక్సువల్ పాత్రకు సమంత ఓకే చెప్పడం గమనార్హం. అయితే ఈ పాత్ర సమంత సరిపోతుందని సూచించింది హీరో రానా అన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియా లో చక్కర్లు పడుతుంది. బిసెక్సువల్ పాత్ర కోసం ఎవరిని ఎంపిక చేయాలి అని  మేకర్స్ ఆలోచిస్తున్న సమయంలో ఆ పాత్రకు సమంత అయితే పూర్తి న్యాయం చేస్తుందని రానా సలహా ఇచ్చినట్లు ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది. దీంతో చిత్ర బృందం ఇక సమంత ను సంప్రదించగా సమంత కూడా పాత్ర నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేసిందట. సమంత తీసుకున్న సంచలన నిర్ణయం వెనుక హీరో రానా ఉన్నాడు అంటూ తెలుగు చిత్ర పరిశ్రమలో టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: