తెలుగు సినిమా సాహిత్య చరిత్రలో ఎంతో మంది గేయ రచయితలు తమ పాటలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. ఓ ఆత్రేయ.. ఆరుద్ర.. వేటూరి అలా ఎంతో మంది సాహిత్యకారులు తమ అద్భుతమైన రచనలతో తెలుగు సినిమా స్థాయిని పెంచి ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాకు మంచి గుర్తింపు వచ్చేలా చేశారు. వారి తర్వాత అదే అద్భుతమైన సాహిత్యాన్ని కొనసాగిస్తూ తెలుగు ఖ్యాతి ని పెంచాడు ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతరామశాస్త్రి.

వేటూరి సుందర రామ మూర్తి తర్వాత తెలుగులో అంతటి గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఆయన ఇప్పుడు అకస్మాత్తుగా మరణించడం సంగీత ప్రియుల కు తీరని లో టు అయింది. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దిగ్గజాన్ని కోల్పోతూ తెలుగు సినిమా పరిశ్రమ ఎంతో దిగ్భ్రాంతికి గురి అవుతుంది. బాలసుబ్రమణ్యం చనిపోయి ఏడాది కాకుండానే ఇప్పుడు సిరివెన్నెల కూడా చనిపోవడం అందరిని తీవ్ర నిరాశకు గురిచేస్తుంది.  ఒకరు పాటలకు ప్రాణం పోసిన వారైతే మరొకరు పాటలు పాడడానికి కావలసిన పదాలను సమకూర్చినవారు.

ఎన్నో గొప్ప రచనలు చేసిన  ఆయన కలం ఇక శాశ్వతంగా రాయదు అంటే హృదయం ఎంతో మెలిపెడుతుంది. ఇది ఆయన పై ఉన్న గౌరవాన్ని సూచిస్తుంది. తెలుగు సిని మా చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు సిరివెన్నెల. సిరి వెన్నెల సినిమాతో ఆయన తన కెరీర్ ను మొదలుపెట్టి విధాత తలపున అనే పాట తో ఆయన తన ప్రయాణం మొదలుపెట్టి అద్వైతం నుంచి రొమాన్స్ వరకు మేలుకొలుపు నుంచి హెచ్చరికల వరకు, విప్లవ గీతాలు సందేశ గీతాలు వంటివి అనేక గీతాలు రచన చేసి పాటల పల్లకిపై ఊరేగిన మహారాజు సిరివెన్నెల సీతారామశాస్త్రి. అయన పాటలకు ఇప్పటితరం వారు కూడా అడిక్ట్ అయ్యారు అంటే అయన ఎంతటి దూరాలోచన తో సాహిత్యాన్ని అందించారో అర్థం అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: