నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ "అఖండ". తాజాగా విడుదలైన 'అఖండ' ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రం గురువారం అంటే డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సెలవుదినం కానప్పటికీ ఈ చిత్రం ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ థియేటర్లలో అద్భుతమైన స్పందనతో ప్రారంభమైంది. తెలుగు ప్రాంతాల్లో అద్భుతమైన ప్రదర్శనతో, యాక్షన్ చిత్రం బాలయ్య మునుపటి చిత్రాలకంటే మెరుగైన ఫలితాన్ని రాబట్టింది. విడుదలైన మొదటిరోజే సినిమాకు ఇంతటి అద్భుతమైన స్పందన రావడం విశేషం.

చాలా మంది విమర్శకులు సినిమా కాన్సెప్ట్, కథాంశం, సీనియర్ నటుల స్క్రీన్ ప్రెజెన్స్‌ని ప్రశంసించడంతో 'అఖండ' అనుకూలమైన సమీక్షలను అందుకుంది. ఇక ఇప్పటికే సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నారు. సినిమా ఇంటర్వెల్, క్లైమాక్స్‌ అద్భుతం అంటూ బాలయ్యను ఆకాశానికెత్తేస్తున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ కోసం వంద సార్లు సినిమా చూడొచ్చు అంటున్నారు బాలయ్య ఫ్యాన్స్. ముఖ్యంగా మౌత్ టాక్ పాజిటివ్ గా ఉంది. హై వోల్టేజ్ డైలాగులు, స్లో మో షాట్లు అభిమానులకు పండగలా ఉంటాయని, మొత్తానికి బాలయ్య, బోయపాటి కలిసి మరోమారు హ్యాట్రిక్ హిట్ కొట్టేశారని సంబరాలు చేసుకుంటున్నారు బాలయ్య అభిమానులు. సోషల్ మీడియా మొత్తం 'అఖండ' జాతరే జరుగుతోంది. థమన్ సంగీతం సినిమాకు మరో హైలెట్ అంటున్నారు. హీరోయిన్ సన్నివేశాలు కాస్త బోరింగ్ గా అనిపించినప్పటికీ నందమూరి అభిమానులకు మాస్ ఫీస్ట్ అని, బాలయ్య చించేశాడని, 5 కు 3 అంటూ రేటింగ్ కూడా ఇచ్చేస్తున్నారు. మరి మిగతా ప్రేక్షకులు ఈ సినిమా గురించి ఎలా స్పందిస్తారో చూడాలి. బాలకృష్ణ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచే అవకాశం ఉంది. బోయపాటి శ్రీను తన చివరి సినిమాతో కెరీర్‌ లోనే అతిపెద్ద పరాజయాన్ని చవి చూశాడు. అయితే బాలకృష్ణతో అతని కాంబినేషన్ గోల్డెన్ హిట్ అయ్యింది.


మరింత సమాచారం తెలుసుకోండి: