‘బిగ్ బాస్ సీజన్ 4’ లో అరియానా ఒక వెలుగు వెలిగింది. బుల్లితెర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిన అరియానా మ్యానియాకు రామ్ గోపాల్ వర్మ కూడ అభిమాని కావడంతో ఆమెకు సినిమా అవకాశాలు బాగా వస్తాయని ఆమె ఆశించింది. దీనికోసం ఆమె ఎక్స్ పోజింగ్ చేస్తూ అనేక ఫోటో షూట్స్ ను కూడ చేసింది.


అయితే ఆమెకు చెప్పుకోతగ్గ అవకాశాలు రాలేదు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన రాజ్ తరుణ్ మూవీ ‘అనుభవించు రాజా’ లో ఈమె కీలక పాత్రలో నటించింది. అయితే ఆ సినిమా ఫెయిల్ అవ్వడంతో ఆమె దిగాలు పడింది. ఈసినిమా ఫెయిల్ అయినప్పటికీ ఇంకా ఈ మూవీ ప్రమోషన్ ను కొనసాగిస్తూ ఈ మూవీని ఏదోవిధంగా నిలబెట్టాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.


ఇలాంటి పరిస్థితులలో ఈమె ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు రాజ్ తరుణ్ పై ఉన్న ద్వేషాన్ని బయటపెట్టి అందరికీ షాక్ ఇచ్చింది. నిజానికి రాజ్ తరుణ అంటే తనకు ఏమాత్రం నచ్చదని చెపుతూ దానికి ఒక ఆశక్తికర కారణాన్ని వివరించింది. అంతేకాదు రాజ్ తరుణ్ సినిమా టివిలో వస్తుంటే ఆ సినిమాను తీసేయని గొడవపెట్టే దానినని అంతేకాదు రాజ్ తరుణ్ కు యాక్సిడెంట్ జరిగి కాలో చేయో విరగాలని తాను గతంలో కోరుకున్న విషయాలను కూడ బయటపెట్టింది.


ఈ స్థాయిలో అరియానా కు రాజ్ తరుణ్ పై కోపం ఏర్పడటానికి ఒక కారణం ఉంది. గతంలో ఒక ఛానల్ కు తాను యాంకర్ గా పని చేస్తున్న రోజులలో తనను రాజ్ తరుణ్ ను ఇంటర్వ్యూ చేయడానికి పిలిపించారని తాను ఉదయం 9 గంటలకు మేకప్ చేసుకుని టివి స్టూడియోకి వెళితే ఒంటిగంట దాటిపోయినా రాజ్ తరుణ్ రాలేదని అంతసేపు వెయిట్ చేయించిన అతడు ఆరోజు మధ్యానం తన కళ్ళముందే తన కారులో వెళ్ళిపోవడం తాను చూశానని అలా వెళ్ళిపోవడం చూసిన తనకు ఇంటర్వ్యూకు వచ్చే ఉద్దేశ్యం లేకుంటే తనను ఎందుకు అంతసేపు వెయిట్ చేయించాడు అంటూ అప్పట్లో తెగ కోపం వచ్చింది అన్న విషయాన్ని గుర్తుకు చేసుకుంది. అయితే  రాజ్ తరుణ్ సినిమాకు సంబంధించి డబ్బింగ్ కరెక్షన్ ఉండటంతో అలా తనను వెయిట్ చేయించిన విషయం తనకు ఆలస్యంగా తెలిసింది అని అంటోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: