నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత కొన్నేళ్లుగా మంచి విజయం కోసం ఎదురుచూస్తున్నా నందమూరి బాలకృష్ణ సినిమా బాగా కలిసి వచ్చింది అనే అభిప్రాయం చాలా వరకు వ్యక్తమవుతోంది. సినిమాకు సంబంధించిన అన్ని విధాలుగా కూడా బోయపాటి శ్రీను చాలావరకు కష్టపడ్డారని బాలకృష్ణ పూర్తి స్థాయిలో ఈ సినిమా కోసం అన్ని విధాలుగా కూడా సమయం వెచ్చించారని పలువురు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించి కొన్ని కొన్ని అంశాల్లో బాలకృష్ణ గతంలో కంటే చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్లారు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదేవిధంగా ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలకు సంబంధించిన బోయపాటి శ్రీను కాస్త అత్యుత్సాహం ప్రదర్శించారు అనే అభిప్రాయం కూడా ఉంది. ఇక ఈ సినిమాలో శ్రీకాంత్ నటించిన నటనకు అభిమానులు ఫిదా అయిపోయారు అనే చెప్పాలి. ఇక ఈ సినిమాకు సంబంధించి కొన్ని కొన్ని పాటలు అలాగే తమన్ అందించిన సంగీతం సినిమాకు బాగా ప్లస్ గా ఈ సినిమాలో బాలకృష్ణ నటన సినిమా రేంజ్ పెంచింది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇక ఇది పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న పలువురు దర్శక నిర్మాతలు అలాగే కొంతమంది నటులు సోషల్ మీడియాలో బాలకృష్ణకు శుభాకాంక్షలు చెబుతున్నారు. సినిమా మంచి విజయం సాధించాలని బాలకృష్ణ మళ్లీ ట్రాక్ లోకి రావాలని అలాగే ఈ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమ మళ్ళీ గాడిలో పడాలనీ చాలా మంది కోరుకుంటున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా తన సోషల్ మీడియాలో బాలకృష్ణ శుభాకాంక్షలు సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. అలాగే ఇతర దర్శకులు కూడా బాలకృష్ణను ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: