టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోలలో ఒకరైన నందమూరి బాలకృష్ణ మరో సారి మాస్ డైరెక్టర్ బోయపాటి శీను కాంబోలో ఈ రోజు తెలుగు ప్రేక్షకుల ముందు వచ్చాడు. సింహ, లెజెండ్ సినిమాల తర్వాత వస్తున్న 'అఖండ' పై టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది, కానీ అన్ని అవాంతరాలను దాటుకుని ఈ రోజు థియేటర్ లో సందడి చేస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ అంటే ప్రేక్షకులకు కొన్ని లెక్కలు ఉంటాయి. అయితే సినిమాలో ఏది ఏమైనా లీడ్ క్యారెక్టర్ మన బాలయ్య గురించి చెప్పుకోవాలి అంటే, ఇంతకు ముందు తాను చేసిన యాక్షన్ మూవీస్ అన్నింటిలో ది బెస్ట్ పెర్ఫార్మన్స్ అని టాక్ వచ్చేసింది.

ముఖ్యంగా అఘోరా పాత్రలో అవలీలగా నటించి ప్రేక్షకుల అంచనాలను నిలబెట్టుకున్నాడు. వయసు మీద పడుతున్నా ఒక్క సారి పాత్రలోకి ఎంటర్ అయ్యాడంటే పాత్ర పండినట్టే అనేంత నమ్మకాన్ని కలిగిస్తాడు డైరెక్టర్ కి, ఇందులో బాలయ్య చూపించిన మాస్ యాక్షన్ కు ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతున్నారు. థియేటర్ అంతా జై బాలయ్య అంటూ జయ జయ ద్వానాలు వినిపిస్తున్నాయి. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. బోయపాటి శీను కు ఒక బలహీనత ఉంది ఫస్ట్ హాఫ్ అంతా బాగా డైరెక్ట్ చేస్తాడు. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికీ అనవసరమైన హింసకు సంబంధించిన సీన్స్ తో ప్రేక్షకుల మైండ్ తో ఫుట్ బాల్ ఆడేస్తాడు. అయితే అఖండ పాత్ర అయినా సినిమాను వేరే లెవెల్ లోకి తీసుకెళ్తుందా అన్న ఆశలో ఫ్యాన్స్ ఉన్నారు.

అయితే సినిమా ఎలా ఉన్న బాలయ్య మాస్, క్లాస్ రెండింటిలో పరిపక్వత చూపించి ఫ్యాన్స్ కు చాలా రోజుల తర్వాత ట్రీట్ ఇచ్చాడు. మరి సినిమా ఫలితం గురించి తెలియాలంటే కనీసం రెండు రోజుల ఆగాల్సిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: