బుల్లితెర ప్రేక్షకులు అందరికి ఎంతగానో ఎంటర్టైన్మెంట్ అందించిన బిగ్బాస్ కార్యక్రమం ఇటీవలే గ్రాండ్ ఫినాలే ఎంతో గ్రాండ్ గా ముగిసింది. దాదాపు వంద రోజులకు పైగానే బిగ్బాస్ కార్యక్రమం ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో ఎవరు విజయం సాధిస్తారో అన్నదానిపై అందరూ ఆసక్తిగా ఎదురు చూడగా.. ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న సన్నీ అందరి కంటే ఎక్కువ ఓట్లు గెలుచుకొని టాప్ లో నిలిచాడు అని చెప్పాలి. ఇక ఎంతోమంది గెస్ట్ ల మధ్య ఈ బిగ్బాస్ కార్యక్రమం గ్రాండ్ ఫినాలే జరిగింది. సాయంత్రం 6 గంటలకు మొదలైనది బిగ్ బాస్ కార్యక్రమం రాత్రి 11:00 వరకు కూడా అందరినీ టీవీలకు అతుక్కుపోయేలా చేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 బిగ్బాస్ కార్యక్రమంలో టాప్ ఫైవ్ కంటెస్టెంట్ లుగా నిలిచారు షణ్ముఖ్ సిరి. వీరిద్దరూ మంచి స్నేహితులు అన్న విషయం తెలిసిందే. అయితే మొదట్లో వీరి మధ్య ఉన్న స్నేహం బుల్లితెర ప్రేక్షకులందరికీ కూడా ఆకర్షించినప్పటికి ఆ తర్వాత వీరి మధ్య ముద్దులు, హగ్గులు  ఎక్కువ కావడంతో ఫ్రెండ్స్ అంటే ఇలా ఉంటారా అంటూ అందరూ చిరాకు పడటం మొదలు పెట్టారు. ఫ్రెండ్షిప్ ముసుగులో షణ్ముఖ్ సిరి రెచ్చిపోతున్నారు అంటూ ఎన్నో వార్తలు కూడా రాశారు. ఆ తర్వాత ఒకానొక సమయంలో బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన సిరి తల్లి  షణ్మఖ్ ను హగ్ చేసుకోవడం నచ్చడం లేదు అంటూ అందరి ముందు చెప్పడం ఒక్కసారిగా షాక్ కి గురిచేసింది.


 అయితే బిగ్ బాస్ హౌస్ లో సిరి తల్లి ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఇక షణ్ముఖ్ ను హగ్ చేసుకోవడం నచ్చడం లేదు అంటూ ముఖం మీద చెప్పగా వెంటనే కలుగజేసుకున్న సన్నీ నేను మానస్ ఎంత మంచి స్నేహితులమో అటు షణ్ముఖ్ సిరి కూడా అంతే మంచి స్నేహితులు అనీ సిరి తల్లికి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించాడు. ఇటీవలే గ్రాండ్ ఫినాలే స్టేజిపై కూడా మరోసారి ఇలాంటి క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించి ఎంతో మంచి మనసులు గెలుచుకున్నాడు. విన్నర్ గా  సన్నిని అనౌన్స్ చేసిన తర్వాత మాట్లాడుతూ షణ్ముక్  గురించి మాట్లాడాడు. షణ్ముఖ్ ఎంతో సైలెంట్ ఎంతో సాఫ్ట్. అయితే ఈ స్టేజ్ మీద ఈ క్లారిటీ ఇవ్వాలని నాకు అనిపించింది. బిగ్ బాస్ లో షణ్ముఖ్ సిరి గొప్ప ఫ్రెండ్. నేను మానస్ ఎంత మంచి ఫ్రెండ్సో అందరికీ తెలుసు. అలాగే వాళ్ళు కూడా ఎంతో మంచి ఫ్రెండ్స్ అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఎమోషనల్ అయినా షణ్ముక్ వెంటనే వచ్చి సన్నిని కౌగిలించుకున్నాడు. ఇక సన్నీ ఇచ్చిన క్లారిటీ ఇది అందరూ ఫిదా అయిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: