‘భీమ్లా నాయక్’ సంక్రాంతి రేస్ నుండి తప్పుకోవడంతో ‘ఆర్ ఆర్ ఆర్’ నిర్మాతలు తెరిపిన పడ్డారు. ఈమూవీ నిర్మాతలు ప్రొడ్యూసర్స్ గిల్డ్ ద్వారా చేసిన ఒత్తిడికి ‘భీమ్లా నాయక్’ నిర్మాతలు రాజీ పడవలసి వచ్చింది. అయితే ఇది అంతా ఓపెన్ గా కనిపించే వ్యవహారం అయితే ‘భీమ్లా నాయక్’ వాయిదా కు దర్శకుడు త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తో చేసిన రాయబారం ఫలించడంతో ‘ఆర్ ఆర్ ఆర్’ కు మార్గం సుగమం అయింది.


ఈవ్యవహారం ముగిసిన తరువాత రాజమౌళి ‘భీమ్లా నాయక్’ నిర్మాతలకు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కు సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలియచేసాడు కాని ఎక్కడా త్రివిక్రమ్ పేరును ప్రస్తావించకపోవడం త్రివిక్రమ్ వీరాభిమానులకు చాల అసహనాన్ని కల్గించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి పవన్ తో త్రివిక్రమ్ రాయబారం చేయకపోతే ‘భీమ్లా నాయక్’ వెనక్కితగ్గి ఉండేది కాదు అన్నది ఓపెన్ సీక్రెట్.


ఈ వాస్తవం తెలిసి ఉండి కూడ రాజమౌళి తాను తెలియచేసిన కృతజ్ఞతలలో పొరపాటున త్రివిక్రమ్ మర్చిపోయాడా లేకుంటే ఇందులో మరో కారణం ఉందా అంటూ చాలామంది సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. ఇలా సందేహాలు ఏర్పడటానికి కారణం త్రివిక్రమ్ కు రాజమౌళికి చెప్పుకోతగ్గ సాన్నిహిత్యం లేకపోవడమే అనుకోవాలి.


పరిస్థితులు ఇలా ఉంటే ‘భీమ్లా నాయక్’ కు మహాశివరాత్రి రోజు అయిన ఫిబ్రవరి 25న రిలీజ్ డేట్ కేటాయించడం పవన్ అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు. ఒమైక్రాన్ కేసులు ఖచ్చితంగా ఫిబ్రవరి నెలాఖరుకు తారా స్థాయికి చేరుకుంటాయి అన్న అంచనాలు చాల స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాంటి పరిస్థితులలో తిరిగి ప్రకటింపబడే కఠిన నిబంధనల నేపధ్యంలో ‘భీమ్లా నాయక్’ కు కలిసి వచ్చేది ఏమిటి అంటూ పవన్ అభిమానుల ఆవేదన. ఈ సంవత్సరం కరోనా సెకండ్ వేవ్ పీక్ లో ఉన్నప్పుడు ‘వకీల్ సాబ్’ విడుదల అయితే వచ్చే ఏడాది థర్డ్ వేవ్ పీక్ లో ఉన్నప్పుడు ‘భీమ్లా నాయక్’ విడుదల అవుతుంది అనుకోవాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి: