ఇక రెండవది ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు గారి పాత్ర స్టోరీకి మరో హైలెట్ గా నిలిచేలా ప్లాన్ చేశారు. ఇందులో నటుడు కృష్ణంరాజు మహాజ్ఞాని అయిన పరమహంస పాత్రలో కనిపించారు. అలాగే మొదట టైటిల్ ను బట్టి హీరోయిన్ పేరు రాధ అని చాలా మంది అనుకోగా ప్రేరణ అని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో ఊహించలేనన్ని ట్విస్ట్‌లు, టర్నింగ్స్ ఉన్నాయని అర్థమౌతోంది. నాలుగేళ్లు శ్రమించి తెరకెక్కించిన ఈ చిత్రం ఆశించిన ఫలితాలను మించి అందించేలా కనిపిస్తోంది. నిజానికి ఈ సినిమా కథ రాయడానికి 18 ఏళ్లు పట్టిందట.
ముందుగా ఈ కథను రాధాకృష్ణ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి వద్దకు తీసుకెళ్లారట. మొదట ఈ కథ వినిపించగా ఆ తరువాత ఈ కథకు కంక్లూజన్ ఇవ్వడానికి, అన్ని విధాలుగా కుదరటానికి ఇన్నేళ్లు పట్టిందట. మరి అంతటి కథ ప్రభాస్ కు సెట్ అవ్వాలని రాసి ఉంది మరి. సినిమా ఫలితం ఏ విధంగా ఉండనుంది అన్నది తెలియాలంటే విడుదలకు వరకు ఆగాల్సిందే. ఇందులో ప్రేరణ పాత్ర కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి