కరోనా మహమ్మరి మళ్ళీ పంజా విసురుతున్న సంగతి తెలిసిందే. ఒక వైపు ఈ మహమ్మారి నియంత్రణలో భాగంగా వ్యాక్సిన్ అందుబాటు లోకి వచ్చినా కూడా కరోనా తీవ్రత తగ్గలేదు. సినీ పరిశ్రమ లో చాలా మంది కరోనా బారిన పడుతున్నారు. కొంత మంది కొలుకున్నారు. మరి కొంత మంది ప్రముఖులు కరోనా తో పోరాడి మరణించారు.. ఇప్పుడు మళ్ళీ బాలివుడ్ ఇండస్ట్రీ పై ఈ మహమ్మారి పంజా విసురుతున్న విషయం తెలిసిందే..


బాలివుడ్ లో కరోనా కేసులు మెల్లగా పెరుగుతూ వస్తున్నాయి. గత కొద్ది రోజులు నుంచి ఇప్పటివరకు చాలా మంది కరోనా బారిన పడుతున్నారు..కరీనా కపూర్, మలైకా అరోరా, అర్జున్ కపూర్ సహా ఇంకా చాలా మంది ఈ వైరస్ బారిన పడ్డారు.ఇప్పుడు మరో హీరోయిన్ కూడా కొవిడ్ బారిన పడింది. షాహిద్ కపూర్ హీరోగా నటించిన జెర్సీ సినిమాలో హీరోయిన్‌గా నటించిన మృణాల్ ఠాకూర్‌కు కరోనా వచ్చినట్లు చెప్పారు. అంతేకాదు ఈమెకు ఒమిక్రాన్ వేరియెంట్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈమె ఆరోగ్యం బాగానే ఉంది. ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకుంటుంది అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు.


మరి కొంత మంది మాత్రం ఈమె పరిస్థితి దారునంగా మారిందని గుసగుసలు చెప్పుకుంటున్నారు.ఎక్కువగా సినీ ప్రముఖులు కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఇండస్ట్రీతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో హీరో హీరోయిన్లు, నటీనటులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో మంచు మనోజ్, విశ్వక్ సేన్ లాంటి హీరోలు వైరస్ బారినపడి ఐసోలేషన్‌లో ఉన్నారు. బాలివుడ్ అయితే మాత్రం  చెప్పనక్కర్లెదు. ముంబాయి లో ఉన్న  చాలా మంది సినీ ప్రముఖులకు కరోనా సొకింది. ఇప్పుడు కూడా చాలా మంది ఐసొలెషన్ లో ఉంటున్నారు.. ఈ పరిస్థితి ఇలానే వుంటే మాత్రం మళ్ళీ సినీ పరిశ్రమ మూతపడటం ఖాయం అని సినీ వర్గాల్లొ టాక్ వినిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: