అయితే తాజాగా థమన్ కూడా ఈ లిస్టులో చేరిపోయారు. ఇక కరోనా రాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఆయన కూడా కరోనా సోకింది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌కు సర్కారు వారి పాట మ్యూజిక్ సిట్టింగ్స్ నుంచి కరోనా సోకినట్లు సమాచారం. అలాగే మరోవైపు దుబాయ్ నుంచి వచ్చిన మహేష్ బాబుకు అక్కడే కరోనా సోకిన విషయం అందరికి తెల్సిందే. మహేష్ బాబు సర్కారు వారి పాట మ్యూజిక్ సిట్టింగ్స్‌లో భాగంగా థమన్ కూడా కలిశారు.
థమన్ తో పాటు త్రివిక్రమ్ కూడా నెక్ట్స్ సినిమా కోసం ఆయన్ని కలిశారు. ఇక ప్రస్తుతం థమన్ మాత్రం ప్రస్తుతానికి ఐసోలేషన్‌కు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అయితే సర్కారు వారి పాట సినిమా సెట్‌లో మెయిన్ ఇద్దరు ఇప్పటికే కరోనా బారిన పడటంతో మిగిలిన వాళ్లు ఆందోళనకు గురవుతున్నారు. అందుకు ప్రధాన కారణం ఏంటంటే.. మ్యూజిక్ సిట్టింగ్స్‌లో దర్శకుడు కూడా ఉన్నారు. ఇక ప్రముఖ డైరెక్టర్ పరశురామ్ కూడా టెస్ట్ చేయించుకుంటున్నట్లు సమాచారం.
ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన కీర్తి సురేష్ సైతం టెస్ట్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక కరోనా మహమ్మారి భయం ఆమెను వెంటాడుతుంది. ఈ సినిమాని ఎప్రిల్ 1న విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు పెట్టాలని భావిస్తున్న తరుణంలో.. మహేష్ బాబు, థమన్ కరోనా బారిన పడటంతో చిత్ర యూనిట్ మొత్తం ఆందోళనకు గురవుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి