అందాల ముద్దుగుమ్మ నిధి అగర్వాల్, నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన సవ్యసాచి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపక పోయినప్పటికీ ఈ సినిమాలో నిధి అగర్వాల్ అందచందాలకు, నటనకు మాత్రం తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కడంతో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ లో క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి. అయితే అందులో భాగంగా రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈస్మార్ట్ శంకర్ సినిమాతో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.  ఈ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా నిధి అగర్వాల్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నిధి అగర్వాల్, అశోక్ గల్లా హీరోగా తెరకెక్కుతున్న హీరో సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 15 వ తేదీన విడుదల కాబోతుంది. అయితే ఈ ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ఈ చిత్ర బృందం పలు టీవీ ఛానల్ ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.

 అందులో భాగంగా నిధి అగర్వాల్ కూడా ఒక ఇంటర్వ్యూ పాల్గొని అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. అయితే ఇంటర్వ్యూ లో భాగంగా మీకు ఏ హీరోలతో నటించాలని ఉంది అనే ప్రశ్న ఎదురైంది.  అయితే ఆ ప్రశ్నకు సమాధానం ఇస్తూ నిధి అగర్వాల్... నాది చాలా పెద్ద లిస్ట్, ఇండస్ట్రీలో ఉన్న అందరితో యాక్ట్ చేయాలని ఉంది. అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, చాలా గొప్ప సినిమాలు చేస్తున్నారు. కొత్త హీరోలు కూడా బాగానే చేస్తున్నారు.  కరెక్ట్ గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ తో మరో సినిమా కూడా చేయాలని ఉంది, ఇలా నిధి అగర్వాల్ తాను నటించాలి అనుకునే హీరోల లిస్ట్ ని తెలియజేసింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: