కొంతకాలం క్రితం వరకు థియేటర్ లలో విడుదలైన సినిమాలు ఓటిటి లోకి రావడానికి కాస్త ఎక్కువ సమయం పట్టేది. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు కనబడడం లేదు.  కొన్ని సినిమాలు నేరుగా ఓటిటి లొనే విడుదల అవుతూ ఉంటే, మరికొన్ని సినిమాలు థియేటర్ లలో విడుదల అయినప్పటికీ ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ను సంపాదించుకున్నట్లు అయితే ఆ సినిమాలు ఓటిటి లోకి రావడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. అదే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకున్నట్లు అయితే నెల తిరక్కుండానే ఏదో ఒక ఓటిటి ప్లాట్ ఫామ్ లోకి వచ్చేస్తున్నాయి. కేవలం చిన్న హీరోలు, మీడియం రేంజ్ హీరోల సినిమాలు మాత్రమే కాకుండా స్టార్ హీరోల సినిమాలు కూడా అతి తక్కువ కాలంలోనే ఓటిటి లోకి వచ్చేస్తున్నాయి.  ఇది ఇలా ఉంటే 31 డిసెంబర్ 2021 వ తేదీన విడుదలైన సినిమా అర్జున పాల్గుణ. ఈ సినిమాలో లో శ్రీ విష్ణు హీరోగా నటించగా అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. 

ఈ సినిమాకు తేజ మార్ని దర్శకత్వం వహించాడు. మొదటి నుండి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమా ఎన్నో అంచనాలతో థియేటర్ లో విడుదల అయ్యింది.  కాకపోతే ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అలా థియేటర్ ల దగ్గర ప్రేక్షకులను అలరించలేకపోయిన ఈ సినిమాసినిమా జనవరి 26 వ తేదీ నుండి తెలుగు ప్రముఖ ఓటిటి ఆహా    లో స్ట్రీమింగ్  కానుంది. ఎవరైనా ఈ సినిమాను  థియేటర్ లో చూద్దాము అని మిస్ అయిన వారు ఉంటే జనవరి 26 వ తేదీ నుండి తెలుగు ప్రముఖ ఓటిటి ఆహా లో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: