బాలయ్య బోయపాటి ఇద్దరు కలిసి చేసిన హ్యాట్రిక్ మూవీ బిబి3 అదే అఖండ ఎవర్ గ్రీన్ హిట్ అందించింది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో అంతకుముందు వచ్చిన సిం హా, లెజెండ్ సినిమాల కన్నా అఖండ రీ సౌండ్ ఎక్కువగా వినిపించింద్దని చెప్పొచ్చు. బోయపాటి టేకింగ్.. బాలయ్య ఊర మాస్ యాక్షన్ అఖండకి అద్భుత విజయాన్ని అందించింది. ఇక ఈ సినిమాలో థమన్ అందించిన మ్యూజిక్ మాత్రం స్పెషల్ క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈమధ్య వరుస హిట్లతో దూసుకెళ్తూ సూపర్ ఫాం కొనసాగితున్న థమన్ అఖండకి స్పీకర్లు పగిలిపోయే మ్యూజిక్ అందించాడు.

ఇక అఖండ సంక్రాంతి సంబరాల వేడుక సందర్భంగా అఖండ 2 గురించి హింట్ ఇచ్చాడు బోయపాటి శ్రీను. అతి కొద్దిరోజుల్లోనే అఖండ 2 ఉంటుందని ఆయన అనడం నందమూరి ఫ్యాన్స్ కు సూపర్ జోష్ ఇచ్చింది. అయితే అఖండ 2 వస్తే మళ్లీ థమన్ మ్యూజిక్ తో విజృంభించడం ఖాయమని చెప్పొచ్చు. అఖండ సినిమాలో సాంగ్స్ కన్నా థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ దుమ్ముదులిపేసింది. అఖండ లాంటి ఫోర్స్ ఫుల్ మూవీకి థమన్ అందించిన ఆ బిజిఎం బాగా హైలెట్ అయ్యింది. అందుకే అఖండ సినిమా విజయంలో థమన్ కి ప్రాముఖ్యత ఇచ్చారు.

అఖండ 2 అంటూ వస్తే అంతకుమించి అనిపించేలా మ్యూజిక్ ఇచ్చేందుకు థమన్ సిద్ధంగా ఉన్నాడని తెలుస్తుంది. టాలీవుడ్ లో వరుస క్రేజీ సినిమాలతో థమన్ ఓ రేంజ్ దూకుడు చూపిస్తున్నాడు. అయితే ఎంత బిజీగా ఉన్నా సరే తనకు కావాల్సిన టైం ఇస్తే ఆల్ టైం రికార్డ్ మ్యూజిక్ ఇచ్చేందుకు తాను రెడీ అంటున్నాడు థమన్. మహేష్, పవన్, ప్రభాస్, ఎన్.టి.ఆర్, చిరంజీఎవి సినిమాలతో పాటుగా బాలయ్య సినిమా కూడా థమన్ ఖాతాలో చేరిపోయింది. ఈ సినిమాలతో థమన్ మరోసారి తన మ్యూజిక్ తో ఆడియెన్స్ ని అలరించనున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: