పుష్ప సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న సుకుమార్ డైరక్టర్ గా మరో మెట్టు ఎక్కేశాడని చెప్పొచ్చు. ఇన్నాళ్లు తన సినిమాలతో సౌత్ ఆడియెన్స్ ను మాత్రమే అలరించిన సుకుమార్ పుష్ప సినిమా తో నార్త్ ఆడియెన్స్ ని మెప్పించాడు. పుష్ప రాజ్ మాస్ యాటిట్యూడ్ ని బాలీవుడ్ ఆడియెన్స్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే తెలుగు రెండు రాష్ట్రాలకు ఈక్వల్ గా హిందీ లో పుష్ప వసూళ్లు ఉన్నాయి. సుకుమార్, అల్లు అర్జున్ ఇద్దరి కాంబో సినిమా అంటే ఎలాంటి అంచనాలు ఉంటాయో వాటికి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంది.

ఇక ఇదిలాఉంటే సుకుమార్ చేసిన పుష్ప సినిమా షూటింగ్ మధ్యలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నుండి సుకుమార్ కు ఫోన్ వచ్చిందట. సినిమా గురించి వస్తున్న ఫీడ్ బ్యాక్ పై ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ వారి మధ్య నడిచాయట. అంతేకాదు అక్షయ్ కుమార్ తన తో సినిమా చేయాలని సుకుమార్ కు ఆఫర్ చేశాడని అంటున్నారు. సుకుమార్, అక్షయ్ కుమార్ ఇద్దరు కలిసి సినిమా చేస్తే రచ్చ రచ్చే. బాలీవుడ్ ఖిలాడి అక్షయ్ కు అక్కడ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆల్రెడీ మన తెలుగు డైరక్టర్ క్రిష్ ఆయనతో ఓ సినిమా చేశారు.

ఇప్పుడు అదే తరహాలో సుకుమార్ కూడా అక్షయ్ కుమార్ తో సినిమా కు రెడీ అవుతున్నాడని టాక్. పుష్పతో నేషనల్ వైడ్ గా తన డైరక్షన్ గురించి మాట్లాడుకునేలా చేసిన సుకుమార్ బాలీవుడ్ హీరోలకు తన సత్తా ఏంటన్నది చూపించాడు. అందుకే ముందుగానే అక్షయ్ కుమార్ సుకుమార్ కి ఖర్చీఫ్ వేశాడని అంటున్నారు. సుకుమార్, అక్షయ్ కుమార్ కాంబో సినిమా వస్తే మాత్రం సౌత్ నార్త్ అనే తేడా లేకుండా నేషనల్ వైడ్ ఫ్యాన్స్ ఖుషి అయ్యే సినిమా వస్తుందని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: