దక్ష నాగర్కర్ చాలా రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్  అయిపోతుంది. మరి ఆమె అంతగా నెట్టింట్లో వైరల్ కావడానికి కారణాలు ఏమిటో తెలుసుకుందామా..!
గత వారం రోజులుగా దక్ష నాగర్కర్ పేరే ఎక్కువగా వినిపిస్తోంది. తెలుగులో రెండు, మూడు సినిమాల్లో నటించినా రాని పేరు తన చిలిపి చేష్టలతో తెచ్చుకుంది. నాగచైతన్య చిరంజీవి వంటి క్రేజీ హీరోస్ పక్కన ఈ అమ్మడు చేసిన అల్లరి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. ముంబై బాబా దక్షిణ నాగర్కర్ 2015లో తేజ దర్శకత్వం వహించిన హోరాహోరి మూవీతో వెండితెరకు పరిచయం అయింది. ఆరేళ్ల గ్యాప్ తర్వాత నటించిన జాంబి రెడ్డితో మళ్లీ వెలుగులోకి వచ్చింది. చిరంజీవి భుజం మీద చేతులేసి  సిగ్గు పడిన విజువల్ తో దక్ష ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది.

 ఎవరా ఆ హీరోయిన్ అంటూ ఆరా తీయడం స్టార్ట్ చేశారు. రవితేజ హీరోగా రావణాసుర సినిమా రీసెంట్ గా మొదలు కాగా చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సినిమాలో మరో ఇద్దరు హీరోయిన్స్ అను ఇమ్మానియేల్, ఫరియా అబ్దుల్లా ఉన్నా దక్ష తన చేష్టలతో అందరి దృష్టిలో పడింది. బంగార్రాజు సినిమా లో నటించిన చాలా మంది హీరోయిన్స్ లో దక్ష ఒకరు. నామమాత్రపు పాత్రే అయినా ఈ అమ్మడిపై ఓ పాటను చిత్రీకరించారు. ఈ సాంగ్ లో చైతు,దక్ష మధ్య కెమిస్ట్రీ బాగా పండింది. బంగార్రాజులోని కెమిస్ట్రీ ఈవెంట్ లో కూడా కనిపించింది.
నాగార్జున మాట్లాడుతుంటే వెనకాల చైతు దక్ష వైపు చూసి నవ్వడం, ఆమె కళ్ళు ఎగరేయడంతో ఈ వీడియో వైరల్ అయింది.ఇలా వైరల్ వీడియోలతో పాపులర్ అవుతుంది దక్ష. మొత్తానికి ఈ వైరల్ వీడియోకు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. చైతూకు మొహమాటం ఎక్కువ అని, కళ్ళు ఎగురేస్తే సిగ్గుపడ్డాడని వివరణ ఇచ్చారు దర్శకుడు. ఏది ఏమైనా దీక్ష తన స్టాటజీతో ఈ విధంగా అగ్ర హీరోలతో సైతం నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: