తన సెకండ్ ఇన్నింగ్స్ లో అగ్ర హీరోల తరహాలో దూసుకుపోతున్నాడు జగపతిబాబు. హీరోగా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన జగపతిబాబు ఎప్పుడైతే విలన్ గా యూటర్న్ తీసుకున్నాడో అప్పటినుంచి భారీస్థాయిలో ఆయనకు ఇమేజ్ పెరిగిపోయింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన లెజెండ్ సినిమాతో విలన్ గా  చేశాడు జగపతిబాబు. ఆ సినిమా ఆయన కెరియర్ ను వేరే లెవెల్ కి తీసుకు వెళ్ళింది అని చెప్పవచ్చు. 

హీరో నందమూరి బాలకృష్ణ కు దర్శకుడు బోయపాటి శ్రీను లకు ఈ సినిమా ఎంతవరకు ఉపయోగపడిందో తెలియదు కానీ జగపతిబాబు రూపురేఖలు పూర్తిగా మార్చివేసింది అని చెప్పవచ్చు ఈ లెజెండ్ సినిమా. ఆ తర్వాత ఆయన కెరియర్ వేరే రేంజ్ లో దూసుకుపోయింది. తెలుగు సినిమాలో క్రూరమైన పాత్రలు విలన్ పాత్రలు అంటే అది జగపతి కే వచ్చేది. ఆ విధంగా ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించి తన విలనిజంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు జగపతి. అంతేకాదు ఇలాంటి పాత్రలు కూడా జగపతిబాబు చేయగలడా అనే ప్రశంసలు కూడా దక్కించుకున్నాడు.

ఇకపోతే తాజాగా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన తదుపరి సినిమాల గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. తన అప్ కమింగ్ సినిమాలలో తన పాత్ర గురించి చెప్పి ప్రభాస్ అభిమానులను ఎంతగానో అలరించాడు. తెలుగులో సక్సెస్ అయిన తర్వాత ఇతర భాషలలోనూ ఆయనను తమ సినిమాలలో పెట్టుకునేందుకు ఇంట్రెస్ట్ చూపించారు. ఈ నేపథ్యంలోనే ఇండియా వైడ్ గా ఇమేజ్ దక్కించుకున్న జగపతిబాబు సినిమాలో విలన్ పాత్ర కోసం ఎంపిక అయ్యారు. తాజాగా లుక్ కూడా రిలీజ్ అయ్యింది. అది ఎంత క్రూరం గా ఉందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదలైన తర్వాత అందరూ తనను ఎలా చూస్తారు అన్న టెన్షన్ లో తన లో నెలకొని ఉందని జగపతిబాబు  చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: