సుంద‌ర గోదావ‌రి తీరాల్లో అచ్చ తెలుగు అందాల న‌డుమ సోగ్గాడు వ‌స్తున్నాడు.. బ్లాక్ బ‌స్ట‌ర్ మీట్ అంటూ సంద‌డి చేయ‌నున్నాడు రేప‌టి వేళ.. ఆ వివ‌రాలివిగో... గో..గో ...

సంక్రాంతికి వ‌స్తున్నాను
పండుగ అంతా నాదే  
పండ‌గలాంటి సినిమాతో
మీ అంద‌రి ఆశీస్సులు కోరుతూ
అని చెప్పాడు నాగ్

 
సంక్రాంతి కానుక గా వ‌చ్చిన పండ‌గ లాంటి సినిమా బంగార్రాజు బ్లాక్ బ‌స్ట‌ర్ మీట్ ను రేపు నిర్వ‌హించ‌నున్నారు.రాజ‌మండ్రిలో వీఎల్ పురం,మార్గాని ఎస్టేట్స్ లో సాయంత్రం ఆరు గంట‌ల‌కు నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామ‌ని చిత్ర బృందం తెలిపింది.ఈ వేడుకకు అక్కినేని అభిమానులు అంతా త‌ర‌లిరావాలి కోరింది. కాగా ఇప్ప‌టికే ఈ సినిమా క‌లెక్ష‌న్ల ప‌రంగా ప్ర‌భంజ‌నం సృష్టిస్తోంది.మూడు రోజుల‌కు యాభై కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూలు చేసింద‌ని చిత్ర యూనిట్ చెబుతోంది.

బంగార్రాజుతో
చాలా మంది ఆడిపాడారు
ఆ ఆట ఆ పాట
మ‌ళ్లీ మ‌ళ్లీ కావాలి అని కోరుకుంటున్నారు
అక్కినేని ఫ్యాన్స్..అందుకే బ్లాక్ బ‌స్ట‌ర్ మీట్
సుంద‌ర గోదావ‌రి తీరాల్లో..
వీఎల్ పురం,మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణాన...

 
రానున్న‌రోజుల్లో వ‌సూళ్ల గ్రాఫ్ మ‌రింత పెర‌గ‌నుంది అని కూడా ధీమా వ్య‌క్తం చేయనుంది.సినిమాలో నాగ చైత‌న్య,కృతిశెట్టి జంట ఎంత‌గానో అల‌రించింద‌ని,ఇక‌పై ఈ పెయిర్ తో సినిమాలు వ‌స్తే బాగుంటుంద‌న్న అభిప్రాయం ఒక‌టి అక్కినేని అభిమానులు వ్య‌క్తం చేస్తున్నారు.అదేవిధంగా ప‌క్క‌నే కుర్ర హీరో చైత‌న్య ఉన్న‌ప్ప‌టికీ నాగార్జున త‌న‌దైన శైలిలో డామినేట్ చేశార‌ని, ఇలాంటి పాత్ర‌లు ఆయ‌న మాత్ర‌మే చేయ‌గ‌ల‌ర‌ని, పంచెక‌ట్టులో నాగ్ అదిరిపోయార‌ని,అలనాటి మేటీ హీరో అక్కినేని గుర్తుకు తెచ్చేవిధంగా నాగ్ మ్యాన‌రిజ‌మ్స్ ఉన్నాయ‌ని ప్ర‌శంసిస్తున్నారు అభిమానులు.

 
మంచి వ‌సూళ్లు ఉంటే
నాగ్ మ‌రో మంచి సినిమాకు
రెడీ అయి ఉంటాడు
అవును! ప‌ల్లె నేప‌థ్యంలో
వ‌చ్చే క‌థ‌ల‌కు మ‌రో ల్యాండ్ మార్క్
ఈ సోగ్గాడే...కాదంటారా? ఎనీ డౌట్స్ !
హిస్ట‌రీ రిపీట్స్.... ఎగైన్ అండ్ ఎగైన్ ....

 
సోగ్గాడే సోకును రిపీట్ చేయ‌డంతో నాగ్ స‌క్సెస్ అయ్యారు. ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయ‌డంలో డైరెక్ట‌ర్ కాస్త త‌డ‌బ‌డ్డాడు.డైరెక్ట‌ర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకొంచెం బాగుండి ఉంటే ఈ సినిమా మ‌రిన్ని మంచి మార్కులు కొట్టేసేది.అయినా కూడా సంక్రాంతి బ‌రిలో ఎన్నో అవ‌రోధాలు దాటుకుని వ‌చ్చి,బాక్సాఫీసు వ‌ద్ద నిల‌క‌డ‌గా క‌లెక్ష‌న్లు తెచ్చుకుంటున్న సినిమా ఇదే..ఒక విధంగా ఈ సంక్రాంతి నాగ్ దే..ఆ విధంగా బాక్సాఫీసు క‌లెక్ష‌న్ కింగ్ నాగ్ ..అని చెప్ప‌క త‌ప్ప‌దిక‌!

మరింత సమాచారం తెలుసుకోండి: