ఇటీవల కాలంలో తెలుగులో తెరకెక్కిన చాలా సినిమాలు కూడా ఇతర భాషలలో రీమేక్ అవుతుండటం మనం చూస్తున్నాం. దీన్ని బట్టి తెలుగు సినిమా పరిశ్రమలో దర్శకులకు రచయితలకు ఎటువంటి కొదువ లేదనే విషయం మనకు అర్థమవుతుంది. చాలా సినిమాలు ఇప్పటివరకు తెలుగు నుంచి ఇతర భాషలలో రీమేక్ కాగా అక్కడ కూడా సదరు హీరోలకు నిర్మాతలకు భారీ హిట్ వచ్చేలా చేశాయి ఈ సినిమాలు.  తాజాగా మరో కొత్త ట్రెండ్ ఇప్పుడు సినిమా పరిశ్రమలో కొనసాగుతుంది.

ఏదైనా సినిమా తెరకెక్కుతున్న దశలోనే కథ బాగుంది అన్న టాక్ వస్తే దాన్ని కోట్ల రూపాయలు వెచ్చించి కొనడానికి ఏమాత్రం వెనకాడటం లేదు మేకర్స్. అంతేకాదు ఇతర భాషలలో బాగున్న సినిమాలను సైతం మన తెలుగు నిర్మాతలు వెంటనే కొనేస్తున్నారు. దాని ద్వారా వారు ఆ సినిమా రైట్స్ సొంతం చేసుకొని మంచి వసూళ్లను సాధించుకుంటున్నారు. రీమేక్ సినిమా చేయడం చాలా సులభం ఇప్పటికే సూపర్ హిట్ అయిన సినిమా కాబట్టి పెద్ద రిస్క్ లేకుండానే ఆ చిత్రాన్ని తెరకెక్కించేయావచ్చు అనేది మేకర్స్ ఆలోచన.

అలా నేటివిటీ కి సంబంధించిన పలు అంశాలను మార్చి ఇక్కడి వారికి తగ్గట్లు సినిమా చేస్తే ఆ సినిమా తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది.  ఆ విధంగా తెలుగులో ఇప్పటి వరకు ఇతర భాషల నుంచి వచ్చిన సినిమాలు మంచి విజయాలు సాధించాయి. తాజాగా బాలీవుడ్ లో తెలుగు సినిమా ఒకటి రీమేక్ అవుతోంది. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన బచ్చన్ పాండే చిత్రం ఈ రోజు పెద్ద అనౌన్స్మెంట్ చేసుకుంది. ఈ చిత్రం వరుణ్ తేజ్ హీరోగా నటించిన గద్దల కొండ గణేష్ చిత్రానికి రీమేక్. తమిళంలో సూపర్ హిట్ అయిన జిగర్తాండా సినిమాకు ఇది తెలుగు రీమేక్ కాగా తెలుగు సినిమా ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాడు అక్షయ్ కుమార్

మరింత సమాచారం తెలుసుకోండి: