యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం రాధే శ్యామ్ అని అందరికి తెలిసిందే ఈ సినిమా కరోనా వలన పలు ఇబ్బందులు ఎదుర్కొందని తెలుస్తుంది.1970ల నాటి కథగా తెరకెక్కబోతుంది.అందులోనూ సినిమా అధిక భాగంగా ఇటలీలో నేపథ్యంలో సాగుతుందని ఇటలీ దేశ పరిస్థితులు తెరపై చూపించడానికి చిత్ర యూనిట్ ఎంతో కష్టపడ్డారట.


రాధే శ్యామ్ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసిన రవీందర్ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడని తెలుస్తుంది..రాధే శ్యామ్ సినిమా కోసం దాదాపు రెండేళ్లు ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇటలీ 1970ల నాటి పరిస్థితులను అధ్యయనం చేశారని తెలుస్తుంది. ఇక 70 మందితో కూడిన టీం ఇటలీలో పర్యటించడం జరిగిందట. రాధే శ్యామ్ మూవీలో కనిపించే లొకేషన్స్ మరియు వస్తువులు ఆ కాలానికి సంబంధించినవిగా ఉండేలా వారు చాలా కష్టపడ్డారట.

రాధే శ్యామ్ మూవీలో కనిపించే ఫర్నిచర్ మరియు ఫైర్ క్రాకర్స్, అద్దం అలాగే టెలిఫోన్ ఇలా ప్రతి వస్తువు సహజంగా కనిపించేలా పెద్ద ప్రయత్నమే చేశారు.. రాధే శ్యామ్ షూటింగ్ దాదాపు ఇటలీలో ఎక్కువగా ప్లాన్ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అక్కడ షూటింగ్ కుదరలేదు. ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ ఏర్పడగా… హైదరాబాద్ లో ఇటలీ దేశాన్ని తలపించేలా సెట్స్ వేశారట.. కొంత భాగం షూటింగ్ సెట్స్ లో పూర్తి చేసినట్లు సమాచారం.

ప్రేక్షకుడికి ఓ గొప్ప అనుభూతి పంచడానికి చిత్ర యూనిట్ ఎంతగానో కష్టపడ్డారు. దర్శకుడు రాధాకృష్ణ ఈ చిత్రాన్ని పీరియాడిక్ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారట.. ప్రభాస్ కి జంటగా పూజా హెగ్డే నటించిన విషయం అందరికి తెలిసిందే.ప్రభాస్ ఈ మూవీలో హస్తసాముద్రికుడి పాత్ర చేస్తున్నారు. జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సిన రాధే శ్యామ్ కరోనా ఆంక్షల కారణంగా వాయిదా పడిన విషయం అందరికి తెలిసిందే.. ఫిబ్రవరి లేదా మార్చ్ లో రాధే శ్యామ్ విడుదల ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ప్రభాస్ నుండి సినిమా వచ్చి రెండేళ్లు దాటిపోయిందట.ప్రభాస్ చివరి చిత్రం సాహో 2019లో రిలీజ్ అయింది.రాధే శ్యామ్ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ హైప్ నెలకొని ఉందట.. రాధే శ్యామ్ విడుదల వాయిదా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులను పూర్తిగా నిరాశపరిచిందని తెలుస్తుంది.మరోవైపు 2022లో ప్రభాస్ నుండి మరో రెండు చిత్రాలు రానున్నాయని సమాచారం.

 
కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ వేసవి కానుకగా ఏప్రిల్ లో విడుదల కావాల్సి ఉంది. ఇక ప్రభాస్ ఫస్ట్ మైథలాజికల్ చిత్రం అయిన ఆదిపురుష్ ఆగస్టులో విడుదల కావాల్సి ఉందని తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: