టాలీవుడ్ క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన  సూపర్ డూపర్ హిట్ సినిమాలలో 'హ్యాపీ డేస్' సినిమా కూడా ఒకటి. అప్పట్లో ఈ సినిమా చూసి చాలా మంది కుర్రాళ్లు ఇంజనీరింగ్ బాటపట్టారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ సినిమాలో కాలేజీ లో ఉండే లవ్ ఎమోషన్స్, గొడవలు, ఫ్రెండ్షిప్ ఇలా అన్ని ఎమోషన్స్ ను  కళ్లకు కట్టినట్టు చూపించారు దర్శకుడు శేఖర్ కమ్ముల. ఇక సినిమాలో నటించిన పలువురు మాత్రం గుర్తింపు ఉన్న హీరో, హీరోయిన్స్ గా మారిన సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలో నటించిన తమన్నా ఇప్పుడూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

ఇప్పటికీ ఈ ముద్దుగుమ్మ సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. అంతే కాకుండా హ్యాపీ డేస్ తర్వాత వరుణ్ సందేశ్ కూడా మంచి అవకాశాలు దక్కించుకుని హీరోగా రాణించాడు. అదే విధంగా అదే సినిమాలో నటించిన హీరో నిఖిల్ కూడా ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే ఈ చిత్రంలో నటించిన మరికొందరు నటీనటులకు మాత్రం సినిమా అవకాశాలు అంతగా రాలేదు. దీంతో వారు వేరే దారి చూసుకున్నారు. అలాంటి వారిలో హ్యాపీ డేస్ సినిమా లో నిఖిల్ గర్ల్ ఫ్రెండ్ గా నటించిన అప్పు కూడా ఒకరు. అప్పు అసలు పేరు గాయత్రీరావు. ఆమె తల్లిదండ్రులు కూడా నటీనటుల కావడం విశేషం.
 

ఇక గాయత్రీరావు హ్యాపీ డేస్ సినిమా తర్వాత మళ్లీ ఆరెంజ్, గబ్బర్ సింగ్ వంటి సినిమాల్లో నటించింది. ముఖ్యంగా గబ్బర్ సింగ్ సినిమాలో శృతిహాసన్ ఫ్రెండ్ గా నటించి గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. అయితే ప్రస్తుతం గాయత్రీరావు సినిమాలకు దూరంగా ఉంటోంది. అంతేకాకుండా ఇటీవలే పెళ్లి చేసుకుని భర్తతో చెన్నైలో ఉంటున్నట్లు సమాచారం అందుతోంది. అయితే హ్యాపీడేస్ సినిమా తరువాత పలు సినిమాల్లో నటించినా అవి ఆమెకు అంతగా గుర్తింపును తెచ్చి పెట్టలేక పోయాయి. దీంతో సినిమాలకు దూరం అయిపోయింది గాయత్రీరావు. ఇక ప్రస్తుతం తన భర్తతో చెన్నైలోనే జీవనాన్ని కొనసాగిస్తుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: